అమెరికా లో సోషల్ డిస్టాన్స్ , లాక్ డౌన్ నియమాలను సడించాలనుకుంటున్నపుడు కరోనా వైట్ హౌస్ లో ప్రత్యక్షం కావడమే కాదు, తానెంతో వరకు దూసుకుపోయిందో ఈ రోజు చెప్పింది.
దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కార్యాలందాకా కూడా కరోనా వైరస్ వ్యాపించింది.
ఆమె పిఎ కరోనా పాజిటివ్ అని తేలింది.
బుధవారం నాడు ట్రంపు వ్యక్తిగత సిబ్బంది ఒకరరు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసింది. ఇపుడు కరోనా ఆయన కూతురు కార్యాలయంలోకి కూడా ప్రవేశించింది.
వైట్ హౌస్ ప్రముఖుల సమీపలోకి కరోనావైరస్ చేరుకోవడం ఇది మూడోసారి. ట్రంప్ అంతరంగికుడి తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రెటరీ కెటీ మిల్లెర్ కూడా కరోనా పాజిటివ్ అని పరీక్షలో తెలింది.
అయితే, ఇవాంకా పర్సనల్ అసిస్టెంట్ కొద్ది వారాలుగా ఇవాంకాకు దూరంగా ఉంటూ పనిచేస్తున్నారనిచెబుతున్నారు.. దాదాపు రెన్నెళ్లుగా ఆమె ఇంటినుంచి పనిచేస్తున్నారని వార్త.. అయితే ఆమెలో ఇలాంటి కోవిడ్ -19 రోగల క్షణాలు కనిపించడం లేదు.
ఇక, ఇవాంక ట్రంప్, ఆమె భర్త జెరెడ్ కుష్నర్ లు కరోనా పరీక్షలో నెగెటివ్ అని తేలినట్లు సిఎన్ ఎన్ రాసింది.