ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాగా అదుపులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. ఇపుడు కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉంటున్న వారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని, వైరస్ వ్యాప్తి దాదాపుగా కంటైన్‌మెంట్ క్లస్టర్లకే పరిమితం చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇదొక ఇది ఒక మంచి పరిణామం అని వారు పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే రాష్ట్రంలో మరణిస్తున్నారని కోవిడ్ అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇస్తే వారికి ప్రాణాపాయం తప్పుతుందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో కరోనా స్థితిగతుల మీద ఈ రోజు ముఖ్యమంత్రి అధికారలతో సమీక్షించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోకి 700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే ప్రవేశించిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ రోజు ఆయన రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా అధికారలు ఆందోళనకరమయిన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కూలీలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిని, స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే విధంగా ఐసోలేషన్ ప్రక్రియను మొదలుపెట్టామని అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్ ముప్పు పొంచి ఉందని అధికారులు వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని వారు చెప్పారు. చిత్తూరు జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగేందుకు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కారణమని అధికారులు తెలిపారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడి వచ్చిన వారి మీద దృష్టి పెట్టామని కోయంబేడు మార్కెట్ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
కోవిడ్ పరీక్షల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, , ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు చేసిన దేశంలో ప్రధమ స్థానానికి చేరిందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు చేశారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8388 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3091 పరీక్షలు జరుగుతున్నాయి. ఇదే తమిళనాడులో 2799 పరీక్షలు. రాజస్థాన్‌లో 1942 పరీక్షలు జరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.17 కాగా, దేశంలో 3.92 శాతం మరణాల రేటు ఏపీలో 2.28 ఉండగా, దేశంలో 3.3 శాతం ఉండటం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
డిశ్చార్జీలు పెరుగుతున్నాయి:
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న నమోదైన కేసులలో 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయి.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/telugu/breaking/andhra-corona-tally-jumps-to-1930/