ఈ నెల 11 నుంచి ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున వస్తున్న తెలుగువారిని విమనాశ్రయాలనుంచే క్వారంటైన్ సెంటర్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మురం చేసింది.
విదేశాలలోఉద్యోగాలు చేస్తున్నవారు సుమారు 10 నుంచి 13 వేల మంది దాకా కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తిరిగి వస్తున్నారు.
వీళ్లెవరూ విమానాశ్రయాలనుంచి జారుకోకుండా అందరిని కనిపెట్టుకుని, వెంటనే క్వారంటైన్ తరలించేందుకు సిద్ధంగా ఉండాలనిరాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న వారుంతా బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లకు రానున్నారని వారిని పసిగట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
శనివారం ఉదయం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్ ఫోర్ట్ కార్యదర్శి, రాష్ట్ర కరోనా నోడల్ అధికారి ఎమ్ టి కృష్ణ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారు ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి చేరుకోవడం జరుగుతుందని కృష్ణ బాబు చెప్పారు.
అందువల్ల ఎప్పటికప్పుడు వారి రాకను పసిగట్టి వారిని క్వారన్ టైన్ కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు. క్వారంటైన్ లో 14 రోజుల పాటు వారికి వసతి కల్పిస్తారు.
దీనికి సంబంధించి కృష్ణ జిల్లాకు చెందిన అధికారులు హైదరాబాదులో, నెల్లూరు జిల్లాకు చెందిన అధికారులు చెన్నైలో, అనంతపురం జిల్లాకు చెందిన అధికారులు బెంగళూరులో రిసెప్షన్ అధికారులుగా ఉంటారు.
మన రాష్ట్రానికి వస్తున్న వివిధ జిల్లాల వారితో ఆయా జిల్లాల అధికారులు కోఆర్డినేట్ చేసుకొని, వారికి వసతి కల్పించడంతోపాటు 14 రోజులపాటు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండేలా చూసుకుని అవసరమయితే వారికి చికిత్సలు నిర్వహించాలని కార్యదర్శి తెలిపారు.
జిల్లా అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన వారిని ప్రత్యేక వాహనాల్లో తరలించు కొని తీసుకువస్తామని, ఏదైనా జిల్లాలకు చెందిన వారు తక్కువగా ఉంటే వారిని ఎక్కువ మంది ప్రయాణికులున్న జిల్లాలతో కలిపి బస ఏర్పాటు చేయాలి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
అదేవిధంగా అలా వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్ లక్షణాలు ఉంటే వారిని COVID-19 సెంటర్లకు పంపాలి.
రిసెప్షన్ అధికారులు ఆయా జిల్లా జాయింట్ కలెక్టర్లుతో పాటు ప్రత్యేక అధికారి తో సంప్రదింపులు జరపాలని విమానం వచ్చినవెంటనే బయటి నుంచి వచ్చే వారికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న అతిథులకు స్వాగతం అంటూ బోర్డు పెట్టాలని కార్యదర్శి కృష్ణ బాబు సూచించారు.
క్వారంటైన్ సెంటర్లో ఒక్కో వ్యక్తికి ఒక రూము ఉండేలా ల ఏర్పాటు చేయాల్సి ఉంటుందని రాష్ట్రానికి సంబంధించి 10 నుంచి 13 వేల మంది రానున్నారని వీరందరికి పరీక్షలు నిర్వహించడం ఎవరికైనా పాజిటివ్ లక్షణాలు ఉంటే వారిని వెంటనే కోవిద్ సెంటర్ కు పంపాలని కృష్ణబాబు తెలిపారు.
Think your friend would be interested in the story, pl share it!