విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. సుమారు పది మంది మృత్యువాత పడగా అనేకమంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో కొందరు కోలుకుంటున్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు.
కాగా గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీ చైర్మన్‌గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ ను నియమించింది. ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ ఐంది.
కమిటీ సభ్యులుగా పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కే మీనా, పీసీబీ మెంబర్ వివేక్ లు ఉన్నారు. హైపవర్ కమిటీ లీక్ కారణాలను విచారించి నెలరోజుల్లోగా నివేదిక సమర్పించనుంది.