గ్యాస్ లీక్ కు కారణం నియమాలను, ఇతర చట్టబద్ధ అంశాలను అమలుచేయకపోవడమే కారణమని చెబుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) విశాఖ పట్టణలోని ఎల్ జి పాలిమర్స్ కు రు. 50 కోట్ల తాత్కాలిక జరిమాన విధించింది. ఇదే సమయంలో ఈ విషయం మీద కేంద్ర రాష్ట్రాలకు నోటీసులకూడా జారీ చేసింది.
“Having regard to the prima facie material regarding the extent of damage to life, public health, and environment, we direct LG Polymers India Pvt., Limited to forthwith deposit an initial amount of Rs. 50 Crore, with the District Magistrate, Visakhapatnam, which will abide by further orders of this Tribunal. The amount is being fixed having regard to the financial worth of the company and the extent of the damage caused.”
ఎన్ జిటి చెయిర్ పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ అధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ లీక్ కు దారి తీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా బెంచ్ నియమించింది. ధర్మాసనంలో షియో కుమార్ సింగ్, డాక్టర్ నగిన్ నందా ఉన్నారు.
ఎల్ జి పాలిమర్స్ నుంచి నిన్నతెల్ల వారుజామున స్టైరీన్ అనే విషవాయువు లీకయి 11 మందిచనిపోవడం, మరొక వేయిమంది దాకా దాని దుష్ఫ్రభావానికి లోనైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మే 18 లోపు తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
మనుషుల ప్రాణాలకు, ప్రజారోగ్యానికి,పర్యావరణానికి జరిగిన నష్టం తీరునుబట్టి, తక్షణం రు.50 కోట్లను విశాఖ జిల్లా మేజిస్ట్రేట్ దగ్గిర డిపాజిట్ చేయాలని మేం ఎల్ జి పాలిమర్స్ ను ఆదేశిస్తున్నాం. దీని మీద తదుపరిఉత్తర్వులుంటాయి. కంపెనీ ఆర్థిక స్తోమత్తు ను బట్టి, గ్యాస్ లీకయ్యాన జరిగిన నష్ట విస్తృతిని బట్టి ఈ మొత్తాన్ని నిర్ణయించడం జరిగింది,’ అని బెంచ్ పేర్కొంది.
ఈ ఆదేశాలతో పాటు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎల్ జి పాలిమర్స్కు, కేంద్ర పర్యావరణ శాఖకు, ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నివారణ మండలికి, కేంద్ర కాలుష్య నివారణ మండలికి, విశాక పట్టణ కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. మే 18 లోపు తమ వాదన ట్రిబ్యునల్ కు సమర్పించాలని చెబుతూ తదుపరి వాయిదా మే 18 న ఉంటుందని పేర్కొంది.
ఎన్ జిటి నియమించిన కమిటీలో ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయన రెడ్డి, విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్ లర్ వి రామచంద్ర మూర్తి, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ కెమికల్ ఇంజనీరింగ్ కు చెందిన ప్రొఫెసర్ పులిపాటి కింగ్ లతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ, సిఎస్ ఐ ఆర్ -ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్, నీరి (NEERI) వైజాగ్ చీఫ్ సభ్యులుగా ఉంటారు.
1989 మాన్యుఫాక్చర్, స్టోరేజ్, ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్ షెడ్యూల్ 1 ఎంట్రీ 583 ప్రకారం స్టైరీన్ అనేది ప్రమాదకర వాయువు. అందువల్ల ప్రమాదాలను జరిగినపుడు ఎదుర్కొనేందుకు ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జీన్సీ ఏర్పాట్లుండాలని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.
Styrene gas is a hazardous chemical as defined under Rule 2(e) read with Entry 583 of Schedule I to the Manufacture, Storage and Import of Hazardous Chemical Rules, 1989. The Rules require on-site and off-site Emergency Plans to ensure the prevention of damage.
ఇది కూడా చదవంది
https://trendingtelugunews.com/english/features/what-is-styrene-how-styrene-affect-human-brain-vizag-gas-leak/