గంగాజలంతో కరోనాకు చికిత్స సాధ్యమా? ఐసిఎంఆర్ ఏమంది?

గంగా జలంతో కరోనా రోగులకు చికిత్స చేయవచ్చా? గంగజలాలకు వైరస్ సంహార (anti-viral) లక్షణాలున్నాయా?
గంగాజలాలకు ఇలాంటి దివ్యౌషధ గుణాలున్నాయని చెప్పేందుకు  పరిశోధనా సమాచారమేమిలేదనిచెబుతూ  గంగజాలలను కరోనా చికిత్సకు ఉపయోగించాలన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనను భారతీయ వైద్యశాస్త్రా పరిశోధనా సంస్థ ( ICMR) తోసిపుచ్చింది.
గంగా జలాన్ని కరోనా ట్రీట్ మెంటుకు వాడాలని , ఇదెలా పనిచేస్తుందో చూసేందుకు క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టలాని జలశక్తి  శాఖ అనుబంధంగా ఉన్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG)  ఐసిఎంఆర్ ను కోరింది.
భారతదేశంలో అనేక ప్రయివేటు, ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు కోవిడ్-19 కు మందోమాకో కనిపెట్టేందుకు నానా తంటాలు పడుతున్న సమయంలో ఎన్ మ్ సిజి ఈ ప్రతిపాదన చేయడం విచిత్రం.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/us-president-trumps-valet-tests-corona-positive/

అతుల్య గంగ (Atulya Ganga) అనే ఎన్జీవో కోవిడ్ -19 రోగుల మీద గంగాజలంతో చిక్సిత్స చేసేందుకు (క్లినికల్ ట్రయల్స్ )కు అనుమతినీయాలని ఎన్ ఎమ్ సిజి కి ఒక ప్రతిపాదన వచ్చింది. ఇదే ఎన్ ఎమ్ సి జి ఉత్సాహానికి కారణం.
అయితే, ఈ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు ఐసిఎంఆర్ సుముఖంగా లేదు. ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లేందుకు చాలా సైంటిపిక్ డేటా అవసరమని ఐసిఎంఆర్ పేర్కొంది.
అయితే, కేవలం నీళ్లతో క్లినికల్ ట్రయల్స్ జరపడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదని ఐసిఎం ఆర్ తెలిపింది.
గంగా జలం ఔషధ గుణాల మీద ఇప్పటికయితే అంతబలమయిన డేటా లేదని, క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లేందుకు అది చాలాదని ఐసిఎంఆర్ లో ‘రీసెర్చ్ ప్రపోజల్స్’ ను అంచనావేసేందుకు ఏర్పాటయిన కమిటీ అధ్యక్షుడు  డాక్టర్ వై కెగుప్తా తెలిపారు.
గంగా నదిని పురుజ్జీవింప చేసేందుకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (NMCG) అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇది జలశక్తి శాఖ కింద పనిచేస్తుంది.
కరోనా వైరస్ మీద గంగా జలం పనిచేస్తుందో లేదో కనుగొనేందుకు క్లినికల్ ట్రయల్స్ చేస్తామని చాలా మంది వ్యక్తులు, ఎన్జీవోలు ప్రతిపాదనలను ఎన్ ఎమ్ జిసి కి పింపించాయని, ఈ ప్రతిపాదనలను జలశక్తి శాఖ ఐసిఎంఆర్ కు పంపించిందని ఐసిఎంఆర్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రతిపాదనలను అమలుచేయాలంటే చాలా సైంటిఫిక్ డేటా, గంగా జలాల ఔషధ గుణాలను చూపించే అధారాలు, ఈ సిద్ధాంతాన్నిబలపరిచే గంగాజలాల ఔషధ నేపథ్యం అవసరమని, ఈ విషయాన్ని ఎన్ ఎమ్ సిజికి తెలియడం జరిగిందని డాక్టర్ గుప్తా చేస్తారు. డాక్టర్ గుప్తా, గతంలో ఎఐఐఎమ్ ఎస్ లో డీన్ గా పరిచేశారు.
“At present, the proposal needs much scientific data, proof of concept and a strong background of hypothesis. This has been conveyed to them (NMCG).”
ఈ ప్రతిపాదనలు ఐసిఎంఆర్ కు పంపేముందు గంగాజలాల స్వచ్ఛతను, నీటి లో మడ్డిని పరిశీలించి, ఈ నీటికి ఏదైనా ప్రత్యేక లక్షణాలున్నాయనే విషయాన్ని కనుగొనేందుకు నేషనల్ ఎన్వైరన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (NEERI- నీరి) శాస్త్రవేత్తలను సంప్రదించడం జరిగిందని, గంగజాలలో బ్యాక్టీరియాలను చంపే వైరస్ (bacteriophages) లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పిందని ఎన్ ఎమ్ సిజి ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, గంగాజలాలకు వైరస్ సంహార (anti-viral) లక్షణాలున్నట్లు ఆధారమేమీ లేదని నీరి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గంగాజలాలలో నింజా వైరస్ ఉందని, బ్యాక్టీరియో ఫేజ్ అని ఒక ప్రతిపాదన వాదించినట్లు ఐసిఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి. గంగాజాలలకు మనిషి రోగనిరోధక శక్తిని పెంపొందిచే శక్తి ఉందని మరొక ప్రతిపాదన వాదించింది.
అయితే, ఇలాంటి వాదనలు కాదని, శాస్త్రీయాధారాలుండాలని గంగాజలాలను క్లినికల్ ట్రయల్ కు వెళ్లాలంటే ఈ సమాచారం చాలదనేది ఐసిఎంఆర్ వాదన.