విశాఖ ఎల్ జి పాలిమర్స్ నుంచి లీక్ అయిన గ్యాస్ స్టైరీన్ (Styrene:C8H8 : C6H5CHCH2 )
దీనినే Vinylbenzene,Ethenylbenzene, Cinnamene అని కూడా పిలుస్తారు. ద్రవరూపంలో ఉంటుంది. దీనినుంచే తయారయ్యే పాలి స్టెరీన్ ఘన పదార్థం.
ఉంటే చాలా తొందరగా ఆవిరవుతుంది. నీటిలో కరగదు. స్టైరీన్ కొద్ది మోతాదులో సహజంగా పళ్లలో, కూరగాయల్లో, మాంసంలో కూడా లభిస్తుంది.
రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. మండే స్వభావం కూడా ఉన్న గ్యాస్ ఇది.
మరొక ఆసక్తికరమయిన విషయం ఏమంటే సిగరెట్ పొగలో కూడా కొంత మోతాదులో స్టైరీన్ ఉంటుంది.
స్టైరీన్ ఎలా తయారవుతుంది?
ఇదొక యారోమాటిక్ రసాాయన పదార్థం. బెంజీన్ రె, ఎధిలీన్ తో ఆల్కైలేషన్ ఇథైల్ బెంజీన్ ఏర్పాడుతుంది. దీనిని డిహైడ్రోజినేషన్ చేసినపుడు ఏర్పడే పదార్థమే స్టైరీన్.
ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో ముడిసరుకు కాబట్టి నిత్యజీవింలొ ఎంతో విస్తృతప్రయోజన మున్న వస్తువులను తయారుచేసేందుకు స్టైరీన్ వాయువు చాలా అవసరం.
ఇది మోనోమర్. అంటే తన మాలెక్యూల్స్ తో తానే రియాక్టయి పాలిమర్ గా మారే స్వభావమున్న రసాయం పద్ధారం ఇది.
పాకేజింగ్ ఇండస్ట్రీ లో పాలిస్టైరీన్ ప్లాస్టిక్ రూపంలో దీనిని వినియోగిస్తారు. డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులు తయారేది కూడా ఈ ప్లాస్టిక్ తోనే. రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకు స్టైరీన్ అవసరం.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే కంటైనర్లు, కార్పెట్ అడుగున బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.
ఈ గ్యాస్ ను పీల్చినపుడు ఏమవుతుందని కనుగొనేందుకు పైన పేర్కొన్న వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీల కార్మికుల మీద చాల మంది పరిశోధనలు చేశారు.
ఇది క్యాన్సర్ ను తెస్తుందని కొన్ని పరిశోధనలలో తేలింది. ఈ వాయవు ప్రభావానికి చాలా కాలం లోనయితే Lymphohematopoietic క్యాన్సర్లు అంటే leukemia, lymphoma కలిగించడంతోపాటు తెల్ల రక్తకణాల జన్యుపదార్థం దెబ్బతింటుంది. పాంక్రియాస్, ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా ఈ గ్యాస్ తెస్తుందనేందుకు కూడా ఆధారాలున్నాయి.
స్టైరీన్ పీల్చుకున్నపుడు గోంతులోని మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది.నిజానికి పర్యావరణ దుష్ప్ర భావం నుంచి అంటే విషవాయులను, రోగకారకాలను పీల్చుకున్నపుడు ఊపిరితిత్తులను కాపాడేంందుకు శ్వాసమార్గంలో చాలా అద్భుతమయిన ఏర్పాటు ఉంది. ఈ పని చేసేదే శ్వాస మార్గంలో ఉండే మ్యూకస్ పొర. ఇది నీరు, మ్యూసినలు (ఒక రకం ప్రొటీన్లు) కలసి చిక్కటి జెల్. ఇది మనం పీల్చుకునే గాలిలొ ఉండే చాలా రకాల రోగకారకాలను, విషపదార్థాలను అడ్డుకుని అవి ఊపిరిత్తులలో చేరకుండా నిరోధిస్తాయి. ఎలా నిరోధిస్తాయో తెలుసా, అదొక అలలాగా పడిలేచి వాటిని వడకట్టుతుంది, బయటకు ఎగగొడుతుంది. మరొక పద్ధతి దగ్గు పుట్టించడం. దగ్గినపుడు రోగకారకాలు బయట పడతాయి. మ్యూకస్ బలహీన పడితే, ఈ హాని చేసే పద్ధార్థాలు వూపిరితిత్తుల్లోకి వెళ్లి వాటిని దెబ్బతీస్తాయి. స్టైరీన్ వల్ల మనకు హానీ జరిగేది ఈ మ్యూకస్ దెబ్బతినడం వల్లే.
ఈ వాయువు సాధారణంగా శ్వాస ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది.నీళ్లుఆహారం ద్వార శరీరంలోకి ప్రవేశించడం అరుదు.శరీరంలోకి ప్రవేశించాక దీని ప్రభావం సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఎక్కువ మోతాదులో స్టైరీన్ ను పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి సెన్సేషన్ వస్తుంది. తర్వాత స్పృహ కోల్పోతారు. ఇతర దుష్ప్రభావాలకు సంబంధించి తలనొప్పి రావడం, చర్మం మీద దురద పుట్టడం జరుగుతుంది. కళ్లు మండుతాయి. మరీ ఎక్కువ సేపు ఈ వాయువుకు ఎక్స్ పోజ్ అయితే, న్యూరో బిహేవియర్ లో మార్పు వస్తుంది. స్టైరీన్ దుష్రభావానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ వాాయువు విషవాయువే కాని అంత ప్రాణాంతకం కాదు. న్యూరో టాక్సిన్ అనే మాట నిజమే. ఈ వాయువును పీల్చుకున్నపుడు అది వూపిరితిత్తులలోకి ప్రవేశించాక శరీరానికి అక్సిజన్ అందకుండా చేస్తుంది. అపుడు మెదడుకు అవసరమయిన మోతాదులో ఆక్సిజన్ అందదు. అపుడు మనిషి అపస్మారక స్థితిలోకి జారుకుంటారు. ఇదే ఇపుడు జరిగింది.
Styrene Monomer: Safe Handling Guide, July 2018 లో స్టైరీన్ వాయువు మనుషుల మీద కలిగించే దుష్ప్రభావాల గురించి వివరంగా చెప్పారు. ఇందులో కొంత భాగాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాము.
Inhalation studies in rats indicate that styrene generally
has moderate acute toxicity (4 hour LC50 is 11.8
mg/L). Some strains of mice (B6C3F1) are particularly
sensitive; i.e. deaths occurred in mice exposed for
6 hours at a concentration of 500 ppm styrene.
Humans exposed at 100 ppm for up to 7 hours have described slight irritation to the eyes and the throat with
the effects becoming more severe with increasing doses.
Higher styrene exposures (i.e. > 100 ppm), but still well
below the lethal dose in the rat, produce immediate eye
and nose irritation accompanied by depressant effects
on the central nervous system (e.g. narcosis, fatigue,
dizziness). As the smell (odor threshold = 0.1 ppm)
and the irritant properties of styrene preclude
exposures at such high and harmful concentrations, it
is virtually impossible under normal working conditions
to be exposed to a lethal dose of styrene.
విశాఖ ఫ్యాక్టరీ చుట్టూర మూడు నాలుగు కిలో మీటర్లలో ఉన్న అయిదు గ్రామాలలో స్టైరీన్ విష ప్రభావం కనిపించింది. విష ప్రభావం తర్వాత చెల్లాచెదరుగు స్పృహ తప్పిపడిపోయిన మనుషులను, జంతువులను చూస్తే 1984లో జరిగిన బోపాల్ విషవాయు ప్రమాదం నాటి పరిస్థితిని గుర్తు చేసింది.
అపుడు యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ నుంచి మిధైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకయినపుడు సుమారు నాలుగువేల మంది చనిపోయారు. మరొక 5 లక్షల మంది గాయపడ్డారు. అయితే, ఇప్పటి విశాఖ గ్యాస్ లీక్ అంత తీవ్రమయిన ప్రమాదం కాదు. స్టైరీన్ అంతటి విషవాయువు కూడా కాదు.
ఎల్ బి పాలిమర్స్ నుంచి స్టైరీన్ వాయువు లీకయ్యాక వెంటనే 180 మంది బాధితులను ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్ తెలిపారు. ఇందలో 48 మంది పిల్లలున్నారని, వారిలో అరుగురికి ఆక్సిజన్ అందించాల్సిన అవసరమొచ్చిందని చెబుతూ అంతా కోలుకుని ఇంటికి వెళ్లారని డాక్టర్ సుధాకర్ తెలిపారు.
లాక్ డౌన్ వల్ల ఈ పరిశ్రమను మూతవేశారు.అయితే లాక్ డౌన్ సడలించాక ఈ ఫ్యాక్టరీని తెరిచే ప్రయత్నం చేశారు. అపుడే పనివారు సరిగ్గా ప్రారంభించలేకపోవడం వల్ల ఈ సైరీన్ లీకయిందని గ్రేటఱ్ విశాఖ మునిసిపల్ కమిషనర్ గుమ్మళ్ళ సృజన తెలిపారు. ఆమె ఈ వ విషయాన్ని ట్వీట్ చేశారు.
Primary report is PVC gas (or Styrene) leaked from LG Polymers, Vepagunta near Gopalapatnam in Visakhapatnam at around 2:30 AM today
Because of the leakage of the said compound gas hundreds of people have inhaled it and either fell unconscious or having breathing issues. pic.twitter.com/WeCdrbddV1— Srijana Gummalla (@GummallaSrijana) May 7, 2020