కేసీఆర్ తన ప్రెస్ మీట్ లో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడానికి సమయాన్ని కేటాయించారని ఏఐసిసి కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్ విమర్శించారు. ఈ రోజలు విలేకరులతో మాట్లాడుతూ ఉన్నవి లేనట్లుగా.. లేనివి వున్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారని ఆయన అన్నారు
సంపత్ ఇంకా ఏమన్నారంటే…
పెద్ద డ్రామా కంపెనీ లాగా కేసీఆర్ ప్రెస్ మీట్ లు ఉంటున్నాయి.
కేసీఆర్ సీఎం పదవి హుందాతనాన్ని దిగజార్చేలా మాట్లాడారు.
కేసీఆర్ మాటలు నీచంగా, నికృష్టంగా, నీచానికి పరాకాష్టగా మాట్లాడారు.
మాకు సంస్కారం అడ్డొచ్చి కేసీఆర్ పై ఆయన లాంటి భాషను వాడలేక పోతున్నాం.
మాట్లాడాలని అనుకుంటే… నీ కంటే ఎక్కువగా మాట్లాడగల భాషా ప్రావీణ్యం మాకు ఉంది… ఖబర్దార్ కేసీఆర్!!
కేసీఆర్ మాపై ఈ తరహా మాటలు మానుకోక పోతే.. గట్టి ప్రతిఘటన తప్పదు.
ముఖ్యమంత్రికి తక్కువ.. జ్యోతిష్యునికి ఎక్కువగా కేసీఆర్ మాటలు ఉన్నాయి.
కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే బహుమతి ఇస్తారా అన్న కేటీఆర్ మాటలు బాధ్యతారాహిత్యం.
కరోనా మహమ్మారిపై కాంగ్రెస్ ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించింది.