విరుగుడు సంగతేమోగాని, కరోనా కళ్లద్దాలొచ్చాయి

విమానాశ్రయాలలో ప్రయాణికుల టెంపరేచర్ (ఉష్ణోగ్రత )పరీక్షిస్తున్నారు. ఇదే విధంగా నగరాలలో షాపుల దగ్గిర  ప్రభుత్వ కార్యాలయాల దగ్గిర ఆసుపత్రులలో కూడా సందర్శకుల టెంపరేచర్ ను పరీక్షించే సాధనాలన ఏర్పాటుచేశారు.
టెంపరేచర్ అనేది కూడా కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ గుర్తించేందుకు పనికొస్తుంది. కరోనా రోగ లక్షణాలలో టెంపరేచర్ పెరగడం కూడా ఒకటి. కోవిడ్ ప్రధాన లక్షణాలలో జ్వరం, పొడిదగ్గు, వూపిరాడకపోవడం అనేవి ముఖ్యమయినవి.
ఒక్కొక్కసారి పొడిదగ్గు, వూపిరాడకపోవడం వంటివి పెద్దగా కనిపించవు. అపుడు టెంపరేచర్ ద్వారా కోవిడ్ ను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం రోజు కు రెండుసార్లయినా టెంపరేచర్ కొలవాల్సి ఉంటుంది. మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల పారన్ హీట్.  జ్వరం వచ్చినపుడు 100.5 డిగ్రీల ఫారిన్ హీట్ దాకా టెంపరేచర్ పెరుగుతుంది. పొద్దున లేస్తూనే జ్వరంతో రాకపోవచ్చు.
సాధాణంగా మధ్యాహ్నం తర్వాత 4 నుంచి 9 మధ్య జ్వరం తీవ్రమవుతుంది. అందువల్ల టెంపరేచర్ ని రెండు మూడు సార్లు కొలిచి కోవిడ్-19 లక్షణాన్ని అనుమానిస్తుంటారు.
జ్వరం కొనుగొనే ఏర్పాట్లన్నీ ఇపుడు కార్యాలయాల దగ్గిరో, ఆసుపత్రులలోనో, విమానాశ్రయాలలోనో ఉన్నాయి. వ్యక్తులుగా ఎవరి దగ్గర ఈ పరికరాలు లేవు. లాక్ డౌన్ సడలించినపుడు గుంపులు పెరుగుతాయి. ఏ గుంపులో ఎవరికి జ్వరముందో ఎలా తెలుస్తుంది. తెలిస్తే మనం గంపులోకి వెళ్లకుండా ఉండవచ్చు.  ఈ సమస్యకు చైనా కు చెందిన ఒక స్టార్టప్ పరిష్కారం కనుగొనింది.
మనకి మూడు మీటర్ల దూరాన ఉన్నవారి  గుర్తించి మనను అప్రమత్తం చేసే కళ్లద్దాలను చైనా స్టార్టప్ తయారు చేసింది. చైనాలోని హ్యాంగ్జో (Hangzhou) కేంద్రంగా పనిచేసే రోకిడ్ ( Rokid) అనే స్టార్టప్ ఈ కళ్ల ద్దాలను తయారు చేసింది. ఈ కళ్లద్దాల పేరు T1 గ్లాసెస్. కేవలం రెండు వారాలలో ఈకళ్ళద్దాలను తయారు చేసి రోకిడ్ అపుడే  వేయిజతలను అమ్మేసింది కూడా అని రాయిటర్ వార్తా సంస్థ పేర్కొొంది.
ఇందులో ఇన్ ఫ్రారెడ్ సెన్సర్లు, కెమెరా ఉంటాయి వాటిసాయంతో వీటిని ధరించిన వారు ఎదురుగా ఉన్నవారి టెంపరేచర్ రీడింగ్  ను చూడవచ్చు.

https://www.facebook.com/RokidAI/posts/4239934236047464

ఒక ప్రదేశంలో ఉన్న టెంపరేచర్ తో పాటు,T1 కళ్లద్దాలు దూరపు టెంపరేచర్ ను కచ్చితంగా చెక్ చేయగలుగుతుంది. అందుకే  ఈ పరికరం చాలా ఉపయోగకరమయిందని  రోకిడ్ వైస్ ప్రెసిడెంట్ సియాంగ్ వెంజియే  తెలిపారు.
ఇపుడు ఒకే సారి చాలా టెంపరేచర్ రీడింగ్ లను రికార్డు చేసే విధంగా ఈ కళ్లద్దాలను అభివృద్ధి చేస్తున్నారు. అపుడు వీటిని విమానాశ్రయాలలో మాల్స్ లో  కూడా వినియోగించవచ్చు. ఈ కళ్లద్దా లు ధరిస్తే కార్యాలయాలనుంచి లేదా విమానాశ్రయాలనుంచి వచ్చే వారిని విడివిడిగా చెక్ చేయనవసరంలేకుడా మూడు మీటర్ దూరాన్నుంచే వారి టెంపరేచర్ ను గుర్తించవచ్చు.అంటే మనిషిని తాకకుండా (Contactless  temperature measurement) శరీర ఉష్ణోగ్రత ను తెలుసుకుని  అప్రమత్తం కావచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద గుంపులలో విడివిడిగా ఉష్ణోగ్రత కొలవడం సాధ్యంకాదు. అలాంటపుడు ఇలాంటి కళ్లద్దాలొకటే మార్గం. T1 కళ్లద్దాలను ధరిస్తే, గుంపులలో కరోనా రోగలక్షణాలున్నవారిని కనుక్కోవడం సులువవుతుంది. అలాగే, అలాంటి గుంపులలోకి వెళ్లకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
అందుకే టి1 కళ్లద్దాలకు కరోనా కొనసాగినంతవరకు బాగా గిరాకి వుంటుందని అనుకుంటున్నారు.