ఏపీలో కొత్తగా మంగళవారం 71 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులుపెరుగుతున్నాయి గాని, ఎవరూ మృత్యువాత పడకపోవడం విశేషం. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా ఎవరూ మృతి చెందలేదు. ఈ రోజు 71 కేసులను గుర్తించడంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 1403 కుపెరిగింది. అ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోన బులెటీన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 43 కేసులు నమోదు అయ్యాయి.
గడచిన 24 గంటల వరకు 6497 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తే ఈ కేసులు బయటపడ్డాయి. జిల్లాల వారీగా కేసులువివరాలు: కర్నూల్ లో 43,గుంటూరు 4, కృష్ణా 10, కడప 4, నెల్లూరు 2, అనంతపురంలో 3, చిత్తూర్ 3, ఈస్ట్ గోదావరి లో 2 చొప్పున కనిపించాయి.
మొత్తం కేసులను పరిశీలిస్తే, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 386 కేసులు, గుంటూరు 287,కృష్ణా జిల్లాలో 246 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా పాజిటివ్ తో 321 మంది రోగులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 1051 మందికి కొనసాగుతున్న చికిత్స పొందుతున్నారు.