ఎపి కరోనా కేసులు 1259, కొత్త కేసులు 82

ఏపీ రోజు రోజుకి  కరోనా పాజిటివ్ కేసులుపెరుగుతున్నాయి. అయితే ఇవి ప్రాణాంతకం కాకపోవడం విశేషం.
 ఏపీ వైద్య ఆరోగ్య శాఖవిడుదల చేసిన   తాజా హెల్త్ బులిటెన్  ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ లో గా మంగళవారం 82 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో  పాజిటీవ్ కేసులు1259 కు చేరాయి.
గడచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 40 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రం మొత్తంగా  5783 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపారు.  కొత్త కేసులకు సంబంధించి కర్నూల్ లో 40,గుంటూరు 17, కృష్ణా 13, కడప 7, నెల్లూరు 3, అనంతపురంలో 1, చిత్తూర్ లో 1 చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
  మొత్తంగా  అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు, గుంటూరు 254,కృష్ణా జిల్లాలో 223 కేసులు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్ తో 258 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 970 మందికి చికిత్స కొనసాగుతున్నది.

 

గత 24 గంటలలో కరోనా ఇన్ ఫెక్షన్ వల్ల ఎవరూ మరణించలేేదు.
ఇది ఇలా ఉంటే, విజయవాడ వైఎస్ ఆర్ కాలనీలో టీ అమ్మే వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అతనిని హాస్పటల్ కు తరలించారు. ఆయన నగరంలో వైఎస్సార్ కాలనీ,కార్మికనగర్,ఆటోనగర్ ప్రాంతాల్లో టీ విక్రయించాడు. అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను క్వారయింటెన్ కు తరలిస్తున్నారు.  వైయస్సార్ కాలనిలో 40వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంతా పేద ప్రజలే. ఈ ప్రాంతంలో కరోనా కట్టడి చేయకపోతే మరో ముంబైగా మారే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.