ఒక సారి కరోనావైరస్ బారిన పడి, ఇసోలేషన్ కు వెళ్లి, ట్రీట్ మెంట్ తీసుకుని అతికష్టమ్మీద జబ్బునయం చేసుకుని, బయటపడ్డాక, మళ్లీ శరీరంలో కరోనా వైరస్ ప్రత్యక్షమవుతుందా?
ఈ మిస్టరీ ఇపుడు ప్రపంచవ్యాపితంగా శాస్త్రవేత్తలను పీడిస్తూ ఉంది. ఎందుకంటే, కరోనాను కంట్రోలు చేసిన సౌత్ కొరియా, చైనాలలో జబ్బు బారినపడి నయయయిన వారిలో మళ్లీ కరోనా కనబడుతూ ఉంది.
శక్తి వంతమయిన RT-PCR పరీక్షలో చాలా మందిలో పాజిటివ్ ఫలితమొచ్చి ఆందోళన కలిగిస్తూ ఉంది.
ఇదెలాసాధ్యం, జబ్బు నయమయ్యాక కూడా వారిశరీరంలో ఇంకా వైరస్ ఎందుకు ఉంది. ఇలా వచ్చింది. కరోనా వైరస్ మృత్యుజయమా?
చైనా లో కూడా ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.
సౌత్ కొరియాలో ఆసుపత్రి ఐసోలేషన్ నరకం నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో సుమారు 163 మందిని పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. ఈ దేశంలొ మొత్తంగా 7829 మంది కోలుకున్న కరోనా రోగులలో 2.1 శాతం మంది మళ్లీ పాజిటివ్ అని తేలింది.
అయితే కోలుకున్నాక ఇలా కనిపించడం ప్రపంచవ్యాపితంగా కరోనాతో యుద్ధం చేస్తున్న డాక్టర్లను, కరోనా బిహేవియర్ ను అధ్యయనం చేస్తున్న డాక్టర్లను కలవర పెడుతూ ఉంది.
చైనాలో, సౌత్ కొరియాలో ఇలా వైరస్ తిరగదోడటంతో, కరోనా తో భీకర యుద్ధం చేస్తున్న అమెరికా, ఇంగ్లండు, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలను ఇంకా బాగా కలవరపెడుతూ ఉంది. ఇదేశాల్లో కూడామళ్లీ నయమయిన వారిలో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది వారి ఆందోళన.
ముఖ్యంగా కరోనాను అదుపు చేసినట్టు చెప్పుకుంటున్న సౌత్ కొరియా, చైనా అధికారులకు ఇదొక మిస్టరీ అయింది. దీనికి కారణం ఏమిటో కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. నమమయ్యాక కూడా శరీరంలో వైరస్ జన్యుపదార్థం తునకలు ఇంకా ఉంటాయా, ట్రీట్ మెంటు ఆపేస్తూనే అమాంతం వాటికి మళ్లీ ప్రాణమొచ్చింది ఒక్కొక్కతునక ఒక్కొక్క వైరస్ గా మారి మళ్లీ గెరిల్లా దాడిచేస్తుందా? లేకపోతే, ఈ టెస్టులన్నీ ఫాల్స్ పాజిటివ్ ఫలితాలిచ్చాయా? లేక కరోనా మన వైద్యానికి తప్పించుకునేందుకు మరొక రకంగా రూపాంతరం చెందిందా? అన్ని ప్రశ్నలేే. దీని మీద CNN ఒక ఆసక్తికరమయిన కథనం అందించింది.
ఈ విషయంలో సౌత్ కొరియా శాస్త్రవేత్తలకు వూరట కలిగించే మరొక విషయం తెలిసింది. ఇలా కోలుకున్నాక మళ్లీ పాజిటివ్ అయిన కేసులలో 44 శాతం మందిలో రోగలక్షణాలు కనిపించినా అవి మైల్డ్ గానే ఉన్నాయి. అవి మరొకరి వ్యాప్తి చెందేస్థాయిలో లేవని వారు కొనుగొన్నారు. ఈ విషయాన్ని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (KCDC) డిప్యూటీ డైరెక్టర్ క్వాన్ జూన్-వూక్ (Kwon Joon-wook) చెప్పారు. అయితే, ఇది నిజమా? కాదని ఆయన చెప్పారు. కోవిడ్ 19 ప్రవర్తన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, అదెపుడు ఎలాప్రవర్తిస్తుందో చెప్పలేం, వేచి చూడాల్సిందే అని ఆయన అన్నారు.
కోవిడ్ -19 జబ్బు నయమయిందేంటే అర్థమేమిటి?
కరోనావైరస్ జబ్బు నయమయిందంటే అర్థం రోగి శరీరం వైరస్ ను హతమార్చిందనే కదా! అంటే రోగిశరీరంలలో వైరస్ ను ఎదుర్కొనే యాంటిబాడీస్ సైన్యం (immunity) బలంగా తయారయిందనేగా అర్థం. ఒక సారి ఒక రోగకారకానికి (pathogen) వ్యతిరేకంగా యాంటిబాడీస్ తయారుకావడం అంటే, ఆరోగ కారకాన్ని ఎలా ఎదిరించాలో శరీరం నేర్చుకున్నట్లే కదా! అంటే అదే రోగకారక వైరస్ శరీరంలో కి మరొక సారి ప్రవేశిస్తే దానిని ఎదుర్కొనే అనుభవం శరీరానికి ఉంది కాబట్టి రెండోసారి జబ్బు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఈ నమ్మకం మీద ఆదారపడే వ్యాక్సిన్ లు తయావుతాయి. అయితే ఇది సార్వకాలిక సత్యం అనరాదని అమెరికా వైట్ హౌస్ కరోనా రెస్సాన్స్ కోఆర్డినేటర్ డా. దెబెరా బిర్క్స్ చెబుతున్నారు.
జబ్బు నయమయ్యాక మళ్ళీ పాజిటివ్ ఎలా అవుతున్నారు?
జబ్బు నయమయ్యాక, రోగి శరీరంలో కొంత వైరస్ అవశేషాలుంటాయని, వారిని టెస్ట్ చేసినపుడు టెస్టు వాటిని కనిపెట్టి పాజిటివ్ గా చూపిస్తున్నదని సౌత్ కొరియా వాళ్లు చేస్తున్న ఒక వివరణ. ఇలా మళ్లీ పాజిటివ్ అని తేలిన వ్యక్తుల కుటుంబాలనుంచి సేకరించిన నమూనాల ద్వారా వైరస్ ను ఇంకుబేట్ చేసేందుకు వారు ప్రయత్నించారు.అయితే,అది పునరుత్పత్తిచెంద లేదు. అంటే వారంతా పాజిటివ్ తేలినా వారిలో ఉన్న వైరస్ నిరపాయకరం అని కోవాలి. ఇదే సౌత్ కొరియాకు ఊరట నిస్తున్నది. అయితే, ఈ ధియరీ అంటే వైరస్ అదే నిరపాయకర స్థితిలో ఉండి చనిపోతుందా లేక జూలు విదుల్చుకుని విజృంభిస్తుందా అనేది తెలేందుకు మరింత కాలం వేచిచూడాలని కూడా వారు సూచిస్తున్నారు.
రోగి శరీరంలో వైరస్ జన్యుపదార్థం (RNA) ఉనికిని కొనుగొనేందుకు సౌత్ కొరియా RT-PCR పరీక్షలను వాడుతున్నది. జబ్బు పడి కోలుకున్నాక మిగిలిపోయిన RNA అవశేషాలను ఈ పరీక్ష పసికడుతున్నందున వారంతా పాజిటివ్ అని వస్తూన్నదని క్వాన్ చెబుతున్నారు.
అయితే, ఇదే ఇదొక కారణం కావచ్చని ఆయన భావిస్తున్నారు. చైనా కు చెందిన ప్రఖ్యాత శ్వాస సంబంధ సమస్య నిపుణుడు జోంగ్ నాన్షాన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ వారంలో ఒక సారి విలేకరులతోమాట్లాడుతూ ఇదేమంత దిగులుపడాల్సిన విషయం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
మరికొన్ని వాదనలు
టెస్టింగ్ దోషం వల్ల కూడా ఇలా పాజిటివ్ ఫలితం వచ్చి ఉండవచ్చని మరొక వాదన. ఇంకొక వాదన వీటన్నింటికంటే భిన్నమయిందేకాదు, కొంచెంఆందోళన కలిగించేది కూడా. అదేమంటే, జబ్బు నయమయ్యా క కూడా వైరస్ మళ్లీ యాక్టివేట్ అవుతూ ఉండవచ్చని ఈ వాదన చేసే వారు చెబుతున్నారు. ఇదే ఆందోళన కల
RT-PCR పరీక్షలు కూడా దోష రహితం కాదు. ఈ పరీక్షల్లో కొన్ని తప్పుడు నెగెటివ్ లు, తప్పుడు పాజిటివ్ ఫలితాలువస్తున్నాయి. రోగం నయమయ్యాక కనిపించిన పాజిటివ్ ఫలితం టెస్టు దోషం వల్ల వచ్చిందయిన ఉండవచ్చని ఈ వాదన చేసేవారు అంటున్నారు. ఎందుకు తప్పుడు ఫలితం వస్తూ న్నది? దీనికి చాలా కారణాలున్నాయి. టెస్టు లో వాడే రసాయనాల ఇలాంటి తప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఒక్కొక్కసారి వైరస్ రూపాంతరం(mutation )చెందినపుడు టెస్టుకు తగలకుండా తప్పించుకోవచ్చు. అపుడు ఫాల్స్ నెగటివ్ వస్తుంది.
అయితే, ఈ కరోనా రోగం నయమయ్యాక వచ్చిన పాజిటివ్ ఫలితం టెస్టుల దోషం వల్ల రాలేదని తేల్చేందుకు దక్షిణ కొరియా ప్రయత్నిస్తూ ఉంది.
ఇలా వైరస్ మళ్లీ ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉందని తెలిశాక, కొరియాలో రెండో సారి క్వారంటైన్ చేస్తున్నారు. కోవిడ్ -19 జబ్బు నయమయ్యాక, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ పాజిటివ్ ఫలితం వస్తే వారిని మరొక రెండు వారాల పాటు ఐసోలేషన్ కు పంపించాలని కొరియా సిఫార్స్ చేస్తూ ఉంది.
ఈ భయం ఇపుడు అమెరికా దాకా పాకింది. ఈ విషయం మీద వైట్ హౌస్ కరోనా రెస్పాన్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ దెబెరా బిర్క్స్ స్పందించారు. కోవిడ్ -19 జబ్బు నయమయ్యాక మళ్లీ వైరస్ తలెత్తుందా అనే ప్రశ్న ఎదురవుతూ ఉంది. దీనికి ఇంకా శాస్త్ర వేత్తల పరిశోధనల నుంచి సమాధానం దొరకడం లేదు. రెండో సారి పాజిటివ్ అని తేలిన వారి నమూనాలను సేకరించివాటినుంచి వైరస్ సంతతి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా మిగిలిపోయినా వైరస్ జన్యు పదార్ధం ముక్కలు ప్రమాదకరమయినవునా కాదా అనేది తేలుతుంది, అని ఆయన చెప్పారు.
అయితే, కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఏ మేరకు పెరిగిందనే విషయాన్ని కనుగొనేందుకు సౌత్ కొరియా పెద్ద ఎత్తున పరిశోధన చేయాలనుకుంటూంది. దీనికోసం 400 శాంపిల్స్ ను సేకరించాలనకుంటున్నది. ఈ ఫలితాలువచ్చే చాలా వారాలు పట్టవచ్చని చెబుతూ కోవిడ్-19 గురించి మనకుతెలిసింది చాలా తక్కువ అనే విషయం మర్చిపోరాదని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 18 నాటికి సౌత్ కొరియాలో కనిపించిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 10,653, ఐసోలేషన్ నుంచి విడుదలయిన వారు 7,937, ఇసోలేషన్ లో ఉన్నవారు 2,484, మృతులు 232.