కరొనా పుట్టినిల్లు వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేసిన చైనా

వూహాన్ లో 76 రోజులుగా కొనసాగుతూ వచ్చిన లాక్ డౌన్ ను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది.
ఇంతవరకు ఎవరూ వూహాన్ నుంచి భయటకువెళ్లకుండా, అలాగే వూహాన్ లోకి రాకుండా మూసేసిన బార్డర్లను కూడా చైనా తెరించింది. అంటే వూహాన్ కు బయటి ప్రపంచంతో సంబంధాలు మళ్లీ మొదలయ్యాయి. వూహాన్ నుంచే కరొనావైరస్ వ్యాపించిన సంగతి తెలిసిందే. దాదాపు కోటి పదిలక్షల జనాభా ఉన్న వూహాన్ హూబై రాష్ట్రానికి రాజధాని. మొట్టమొదటి కరోనా కేసు వూహాన్ లో గత డిసెంబర్ లో కనిపించింది.
కరోనా వైరస్ అంటుకుంటే వదలకుండావ్యాపిస్తుందని తెలియగానే, జనవరి 23 నుంచి వూహాన్ లో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే, బుధవారం నాడు, రైళ్లు కదిలాయి. విమానాలు ఎగిరాయి. హైవై ల మీద వాహనాలు దూసుకుపోవడం మొదలయింది. ఆరోగ్యంగా ఉన్న ప్రజలందరిని బయటకు వెళ్లేందుకు చైనాప్రభుత్వం అనుమతించిందని గ్లోబల్ టైమ్స్ రాసింది..
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/us-telugu-journalist-brahm-kanchibotla-dies-of-covid-19/

 

రైళ్ల రాకపోకలను పునరద్ధరించడంతో సుమారు 55 వేల మంది బుధవారం నాడు రైలెక్కవచ్చని వూహాన్ రైల్వే అధారిటీ వారు చెప్పారు.
వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తి వేయడమనేది కోరానమీద చైనా సాధిస్తున్న విజయంలో మరొక ఘనవిజయం. ఇపుడు చైనాలో కరోనా కేసులు దాదాపు శూన్యమయ్యాయి. వూహాన్ నగరమే సురక్షితం కావడంతో హుబై రాష్ట్రంలో ఇతర నగరాలలో కూడా లాక్ డౌన్ ఎత్తి వేయవచ్చని అనుకుంటున్నారు.
లాక్ డౌన్ ఎత్తి వేయడమంటే కరోనా నివారణ చర్యలను పూర్తిగా ఎత్తి వేయడం కాదని, జీరో రిస్క్ అని అనుకోరాదని, అదేవిధంగా ఇది సంపూర్ణ విజయం కూడాకాదని అధికారులు చెబుతున్నారు. ఇంకా రిస్క్ ఉన్నందునే ఈ రోజు చైనా రైల్వే హై స్పీడ్ కు చెందిన 30 శాతం రైళ్లను మాత్రమే నడపాలని నిర్ణయించారు.
మంగళవారం-బుధవారం అర్ధరాత్రి నుంచే నగరం చుట్టూ ఉన్న75చెక్ పాయంట్లను తెరుస్తారని ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు, ఇతర ప్రాంతాలను వూహాన్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలను అక్కడక్కడ స్క్రీనింగ్ చేయడం కొనసాగుతుందని అధికారులుప్రకటించారు.