ముఖానికి తగిలించుకునే మాస్కు మీద కరోనా వైరస్ ఎన్నిరోజులుంటుంది?

ముఖానికి మాస్క్ తగిలించుకోవడమనేది కరోనావైరస్ కట్టడి చాలా కీలకమయింది. ముఖానికి మాస్క్ లేకుంటే పోలీసులు కూడా బయటకు రానీయడం లేదు. డాక్టర్లు కూడా మాస్క్ తొడుక్కోవడం చాలా అవసరమని చెబుతున్నారు. అందుకే దేశ వ్యాపితంగా మాస్కులు కొనడం విపరీతంగా పెరిగింది. దీనితో అనేక స్వచ్ఛంద సంస్థులుప్రజలకు, హెల్త్ వర్కర్లకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ ఈ మాస్కు మీద ఎన్ని రోజులుంటుంది? దీని గురించి చర్చ జరగనే లేదు. స్టీల్ మీద, కాపర్ మీద, కార్డు బోర్డు మీద ఎంతకాలం ఉంటుందని చెప్పారు గాని,మాస్క్ మీద కరోనా వైరస్ పడితే ఎంతకాలం ఉంటుందనే విషయం ఎవరూ చెప్పలేదు.
అయితే, తొలిసారి కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్ బట్ట మీద కరోనా వైరస్ పడితే వారం రోజులుంటుంది. అంటే మాస్క్ ఎంత ప్రమాదకరమో చూడండి. హాంకాంగ్ యూనివర్శిటీ (HKU) కి చెందిన పరిశోధకులు మాస్క్ మీద కరోనావైరస్ ఉనికి గురించి అధ్యయనం చేశారు.  రకారకాలటెంపరేచర్ వద్ద, రకరకాల వస్తువుల మీద ఈ వైరస్ స్టబిలిటి గురించిన అధ్యయనం The Lancet అనే జర్నల్ లో Stability of SARS-CoV-2 in Different Environmental Conditions  అచ్చయింది.
గది ఉష్ణోగ్రత వద్ద కరొనా వైరస్ రకరకాల ఉపరితలాల మీద పడితే ఎన్నిరోజులు యాక్టివ్ గా ఉంటుందనే మీద అధ్యయనంచేశారు. ఈ అధ్యయనం ప్రకారం టిష్యూ పేపర్, ప్రింటింగ్ పేపర్ మీద పడితే, కరోనావైరస్ మూడుగంటల దాకా ఉంటుంది. తర్వాత బట్ట (Lab jacket cloth), శుద్ధి చేసిన చెక్క మీద పడితే, రెండో రోజు మాయమవుతుంది. అంటే ఒక రోజుంటుంది. కరెన్సీ మీద, గాజు ఉపరితలం మీద పడితే రెండు నుంచి నాలుగురోజులుంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్,ప్లాస్టిక్ మీద పడితే నాలుగు నుంచి వారం రోజులుండటం ఈ పరిశోధకులు గమనించారు.
సర్జికల్ మాస్క్ పై పొర మీద కరోనా వైరస్ కుమనకు  అంటుకుని వ్యాపించే శక్తి వారం తర్వాతకూడాకనిపించింది.
మాస్క్ లు తొడుక్కోవడమనేది చాలా ముఖ్యమయిన విషయమయినందున వారు మాస్క్ వల్ల కరోనావైరస్ వ్యాపించే ప్రమాదం గురించి పరీశీలించారు.

‘SARS-CoV-2 was more stable on smooth surfaces. No infectious virus could be detected from treated smooth surfaces on day 4 (glass and banknote) or day 7 (stainless steel and plastic). Strikingly, a detectable level of infectious virus could still be present on the outer layer of a surgical mask on day 7 (∼0·1% of the original inoculum). Interestingly, a biphasic decay of infectious SARS-CoV-2 could be found in samples recovered from these smooth surfaces (appendix pp 2–7). 39 representative non-infectious samples tested positive by RT-PCR(data not shown), showing that non-infectious viruses could still be recovered by the eluents’.

మాస్కు ధరించే వారు మాస్కుపైబాగాన్ని చేత్తోతాకడం ప్రమాదకరమని వారు చెబుతున్నారు. ఒక సారి మాస్క్ ని చేత్తో తాకినపుడు, అదే చేత్తో కళ్లు తుడుచుకోవడం, ముక్కు రుద్దుకోవడం చేస్తుంటారు. అపుడు వైరస్ కళ్ల కు, ముక్కుకు అంటుకుని శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/china-lifts-lockdown-in-wuhan/

అయితే, ఈ పరిశోధనలో తేలిన మరొక ఆసక్తికరమయిన విశేషమేమిటంటే మన ఇళ్లలో వాడే పురుగుల మందులేవి సోకినా వైరస్ దెబ్బకు చచ్చిపోవడం. బ్లీచింగ్ పౌడర్ కూడా ఈ వైరస్ ను నాశనం చేయడం కనిపించింది.అచ్చయింది.
గది ఉష్ణోగ్రత వద్ద కరొనా వైరస్ రకరకాల ఉపరితలాల మీద పడితే ఎన్నిరోజులు యాక్టివ్ గా ఉంటుందనే మీద అధ్యయనంచేశారు. ఈ అధ్యయనం ప్రకారం టిష్యూ పేపర్, ప్రింటింగ్ పేపర్ మీద పడితే, కరోనావైరస్ మూడుగంటల దాకా ఉంటుంది. తర్వాత బట్ట (lab jacket cloth), శుద్ధి చేసిన నున్నటిఉపరితలం ఉన్న  చెక్క మీద పడితే, రెండో రోజు మాయమవుతుంది. అంటే ఒక రోజుంటుంది. కరెన్సీ మీద, గాజు ఉపరితలం మీద పడితే రెండు నుంచి నాలుగురోజులుంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్,ప్లాస్టిక్ మీద పడితే నాలుగు నుంచి వారం రోజులుండటం ఈ పరిశోధకులు గమనించారు.
అయితే, సర్జికల్ మాస్క్ పై పొర మీద కరోనా వైరస్ కు అంటుకునే శక్తి వారం తర్వాతకూడాకనిపించింది.
మాస్క్ లుతొడుక్కోవడమనేది చాలా ముఖ్యమయిన విషయమయినందున వారు మాస్క్ వల్ల కరోనావైరస్ వ్యాపించే ప్రమాదం గురించి పరీశీలించారు.
మాస్కు ధరించే వారు మాస్కుపైబాగాన్ని చేత్తోతాకడం ప్రమాదకరమని వారు చెబుతున్నారు.
“This is exactly why it is very important if you are wearing a surgical mask you don’t touch the outside of the mask” Malik Peiris అనే క్లినికల్, పబ్లిక్ హెల్త్ వైరాలజిస్టు South China Morning Post కు చెప్పారు.
ఒక సారి మాస్క్ ని చేత్తో తాకినపుడు, అదే చేత్తో కళ్లు తుడుచుకోవడం, ముక్కు రుద్దుకోవడం చేస్తుంటారు. అపుడు వైరస్ కళ్ల కు, ముక్కుకు అంటుకుని శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అయితే, ఈ పరిశోధనలో తేలిన మరొక ఆసక్తికరమయిన విశేషమేమిటంటే మన ఇళ్లలో వాడే పురుగుల మందులేవి సోకినా వైరస్ దెబ్బకు చచ్చిపోవడం. బ్లీచింగ్ పౌడర్ కూడా ఈ వైరస్ ను నాశనం చేయడం కనిపించింది.