దేశవ్యాపితంగా లాక్ డౌన్ ను జూన్ మూడు దాకా పొడిగించాలని ప్రధాని నరేంద్రమోదీని తాను కోరినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఈసాయంకాలం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.ఒక వేళ ప్రధాని మోదీ అంగీకరించకపోతే, తాను తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పారు.
లాక్ డౌన్ పొడిగించాల్సిన అవశ్యకత గురించి ఎల్లుండి తాను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సంభాషించాలనుకుంటున్నానని, ఈ కాన్ఫరెన్స్ లరాజ్యసభ సభ్యుడు కెేశవరావు, లోక్ సభ సభ్యుడు నాామా నాగేశ్వరరావు కూడా పాల్గొంటారని ఆయన చెప్నారు.కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా నేను పొడిగించేందుకు రెడి గా ఉన్నాను.
భారత్ వంటి దేశానికి లాక్ డవున్ ఒక్కటే మార్గం. ఇక్కడ ఇటలీ. స్పెయిన్. అమెరికా లాగ మరణాలు లేవు. అందువల్ల లాక్ డవున్ కొనసాగించి తీరాలి. ఉన్నట్లుండి లాక్ డవున్ ఎత్తేస్తే తీవ్ర పరిణామాలు వుంటాయి, అని కేసీఈర్ అన్నారు.
Boston study group జూన్ 3దాకా లాక్ డౌన్ పొడిగించాలని సూచించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ఆర్థిక వ్యవస్థను తర్వాత బాగు చేసుకో వచ్చు. ముందు ప్రాణాలు కాపాడు కోవాలి
‘మరొక రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించాలనినేను ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాని నిర్ణయాన్ని అంతా సమర్థించాలి. ప్రధాని మోదీని విమర్శించడం తప్పు. ప్రధాని అంటే వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. అలాంటి ప్రధానిని విమర్శించడం క్షమించరాని నేరం,’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
కెసిఆర్ ఇంకా ఏమన్నారంటే…
బోస్టన్ స్టడీ గ్రూప్ (బీసీజీ) సంస్థ జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం అని తెలిపింది. ఇండియా కు లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు. లాక్ డౌన్ ఎత్తివేత పై అనేక చర్చలు జరుగుతున్నాయి.విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొలుకున్నారు.ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు కొలుకున్నారు. మార్కజ్ నుంచి కొరొనా తీవ్రత బాగా వ్యాప్తి చెందింది. కొరొనా తీవ్రత భారీగా ఉంది.కొందరు చికిత్స స్టార్ట్ కాకముందే మృత్యువాత పడుతున్నారు
ఒక కుటుంబం ఒకరి మృతి చెందితే కుటుంబం రోడ్డున పడుతుంది . ఇలాంటి పరిస్థితుల్లో మేధావులందరూ ముందుకు వచ్చి ప్రజలకు అండగా ఉండాలి.
మోడీ పిలుపు పై అనేక విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. దీపారాధన అనేది సంఘీభావ సంకేతం అని నేను అందరికి చెప్పాను. తెలంగాణ ఉద్యమంలో మేము అనేక పిలుపులు ఇచ్చాము. ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు-ఒక వ్యవస్థ. ప్రధానిని విమర్శలు చేస్తే క్షమించరాని నేరం
ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి పాదాభివందనం. 25వేల మందితో వైద్య సిబ్బందితో ఒక ఎక్స్ట్రాపూల్ రెడి చేసాము. 18వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టాము. కోవిడ్-పాజిటివ్ కేసుల కోసం 9 ప్రత్యేక హాస్పిటల్స్ సిద్ధం చేసాము. ఐసీయూ బెడ్స్ తో ఐసోలేషన్ హాస్పిటల్స్ రెడి చేసాము.పీపీఈ కిట్లు ప్రభుత్వం దగ్గర 40 వేలు ఉన్నాయి. 5లక్షల కిట్లకు ఇప్పటికే ఆర్థర్ల్ ఇచ్చాము
నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వాళ్ళను 99.9 శాతం అందరిని గుర్తించాము. నిజాముద్దీన్ ఘటన లేకుంటే తెలంగాణ ఇప్పటికే కొరొనా ఫ్రీ అయ్యేది
ఫార్మా రవాణా సమస్య లేదు… దేశంలో మందుల కొరత లేదు.హైడ్రాక్సిన్ క్లోరోఫామ్ అమెరికా కావాలంటే మోడీ నిరాకరించారు.సంబంధం లేని వ్యకులకు కొరొనా సోకితే కమ్యూనిటీ ట్రాస్మిషన్ రాలేదు
ప్రైవేట్ సంస్థలు జీతాలు ఇవ్వడం లేదని ప్రచారం జరుతుంది-దాని పై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రేషన్ కార్డు లేని పేదలకు కూడా వంద శాతం రేషన్ ఇచ్చేనెదుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది