ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా పరిస్థితిపై ఉన్నత స్ఠాయి సమీక్ష చేశారు. కరోనా వ్యాప్తి గురించి చర్చించారు. ఆంధ్రలో ఉన్నట్లుండి కరోనా పాజిటివ్ కేసులు పెరిగేందుకు ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశానికి వెళ్లివచ్చిన వారిలో కొంతమంది కరోనా పాజిటివ్ అని తేలడమే నని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం వివరాలివే:
13 జిల్లాల్లో 161 పాజిటివ్ కేసులు
140 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే
1085 మంది ని ఢిల్లీ నుంచి వచ్చారు
946 మంది రాష్ట్రంలో ఉన్నారు
139 మంది మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నారు
వీరిలో 881 మందిని గుర్తించి టెస్ట్ చేసాం
108 మందికి పాజిటివ్ వచ్చింది
ఢిల్లీ నుంచి వచ్చిన వారిని కాంటాక్ట్ అయిన వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది
ఇంటింటి సర్వే ఫలితాలు
1.45 కోట్ల కుటుంబాలలో 1.28 కోట్ల కుటుంబాల రోగలక్షణాలు కనిపించే వారికోసం సర్వే పూర్తి అయింది
లాబ్స్ కూడా పెంచాలని నిర్ణయించారు.
గుంటూరు కడప లలో అదనంగా ల్యాబ్ లను ఏర్పాటు చేశాం
విశాఖలో మరో లాబ్ సోమవారం అందుబాటులోకి వస్తుంది
500 మందికి ఇప్పుడున్న వాటి ద్వారా టెస్ట్ చేయవచ్చు
కొత్త వాటితో 900 టెస్టులు చేయవచ్చు
ఇంకా ప్రైవేట్ లాబ్స్ కూడా పరిశీలించమని ఆదేశించారు.
షాప్స్ వద్ద రంగులతో శాశ్వత మార్కింగ్ చేయాలని సీఎం చెప్పారు
షాప్స్ వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలి
క్వారంటీన్, ఐసోలేషన్ సెంటర్స్ లో కనీస వసతులు ఉండాలి…నాణ్యత ప్రమాణాలు పాటించాలి
వలస కూలీలకు 236 క్యాంపులు నడుపుతున్నాం
దీనికి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం.
వారి వసతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు
78 వేల మంది ఉంటే 16 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతులు ఇస్తోంది
మిగిలిన వారికి ఆయా సంస్థలు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి
క్యాంపులో ఉన్నవారికి అక్కడే రేషన్ ఇచ్చేలా చర్యలు
ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదు. ప్రభుత్వం ఇవ్వనున్న 1000 రూపాయలు రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇవ్వాలి .లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇప్పటివరకు ఎలా సహకరించారో ఏప్రిల్ 14 వరకు అదే సహకారం అందించాలి.
కేసులు పెరుగుతున్న తరుణంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు ఎవరూ నష్టపోకూడదు.
వారు పండించిన పంటకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి
అరటి, టమోటా వంటి పంటలు కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చూడాలి
ధాన్యం కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసాం…ఎక్కడా ఇబ్బంది కలగకుండా కొనుగోలు జరగాలి
ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.