ఈ రోజు నిజానికి భద్రాద్రి జనంలో కలకలలాడాలి. సీతారాముల కల్యాణం వైభవంగా జరగాలి. కాని కరొనావైరస్ దెబ్బతీసింది. భద్రాద్రికి భక్తులెవరూ వచ్చేందుకు వీల్లేకుండా పోయింది. అందువల్లకల్యాణాన్ని కేవలం ఆలయానికే పరిమితం చేశారు.
ఏటా అంగరంగ వైభోగంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహించేవారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో దేవస్థానం చరిత్రలో తొలిసారి ఈసారి రామయ్య కల్యాణాన్ని ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద నిర్వహించారు.
భద్రాచలంలో నేడు శ్రీరామ నవమి వేడుకలు, కల్యాణం నిరాడంబరంగా జరిగాయి.
సామాజిక దూరం పాటిస్తూ కేవలం 40 మందికి మాత్రమే అనుమతి నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీసీతారాములకు పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్జి, పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు.
శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఎంతో భక్తి శ్రర్థలతో పూర్తయ్యాయి.
రామయ్య కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని దేవస్థానం అధికారులు కల్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు.
కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలో భక్తులకు కల్యాణం ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత, పరిశుభ్రత మధ్య కల్యాణ మహోత్సవం ముగిసింది.
లాక్ డౌన్ కారణం గా భక్తులు లేక మిథిలా స్టేడియం , భద్రాద్రి ప్రధాన వీధులు బోసి పోయినట్లు కనిపించాయి.కోరోనా ప్రభావితం , భద్రాద్రి సీతారామ ఆంజనేయస్వామి వారి దేవాలయం ఆలయ ప్రాగణంలో నే కళ్యాణం జరపడం వలన ఆరుబయట మొత్తం నిర్మానుష్యంగా ఉంది.