కర్నూల్ జిల్లాలో 4 కరోనా అనుమానిత కేసులు

*కర్నూలు జిల్లాలో 4 కోవిడ్-19 ప్రెజంప్టివ్ పాజిటివ్ కేసులు వచ్చాయి.. 4 కేసులలో కర్నూలు అజీముద్దీన్ నగర్ వ్యక్తికి నెగెటివ్ గా నిర్ధారణ అయింది. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె లలో ప్రెజంప్టివ్ పాజిటివ్ కేసులు గా వచ్చిన 3 కేసులు ఇంకా పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది:కలెక్టర్ వీరపాండియన్*
*ప్రెజంప్టివ్ పాజిటివ్ కేసులుగా వచ్చిన 3 కేసులు పూర్తిగా నిర్ధారణ అయిన తరువాత అధికారికంగా ప్రకటిస్తాం..ప్రజలు ఆందోళన చెందకుండా..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే ముందు జాగ్రత్త చర్యలకు సహకరించండి: కలెక్టర్ వీరపాండియన్*
*నొసం పాజిటివ్ కేసు వ్యక్తికి చికిత్స చేసిన కర్నూలు జిజిహెచ్ పిజి డాక్టరు కు చేయించిన కరోనా టెస్ట్ నెగటివ్ వచ్చింది:
*నొసం లో కరోనా పాజిటివ్ వచ్చిన రాజస్థాన్ యువకుడు ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు:
*కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం ప్రెజంప్టివ్ పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమీషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపిడిఓ లకు ఆదేశాలను ఇచ్చాం:
*ప్రెజెంప్టివ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం రాకపోకల కట్టడి…నిత్యావసరాలకు ఇబ్బంది లేదు.. పోలీసు బందోబస్తు ఏర్పాటు:
*ప్రెజెంప్టివ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం.. ఆ ప్రాంతమంతా క్రిమి సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం*
*అందరూ అప్రమత్తంగా ఉండాలి… ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి…కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్, తహశీల్దార్, ఎంపిడిఓ లకు సమాచారం ఇవ్వండి:
*కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు*
*కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం:
కర్నూలు, ఏప్రెల్2 : ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో కోవిడ్-19 కట్టడికి అన్ని చర్యలను పగడ్బందీగా చేపట్టామని, ఢిల్లీ జమాత్ కు హాజరై జిల్లాకు తిరిగి వచ్చిన వారి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించగా వారిలో ముగ్గురికి కోవిడ్-19 ప్రెజెంప్టివ్ పాజిటివ్ ఉన్నట్లు, ఒకరికి నెగెటివ్ నిర్ధారణ అయినట్లు రిపోర్టులు వచ్చాయని.. అయితే ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉందని, నిర్ధారణ రిపోర్టులు పూర్తి స్థాయిలో వచ్చిన వెంటనే అధికారికంగా తెలియజేస్తామని, అంతవరకు ఆగకుండా కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం 3 ప్రెజంప్టివ్ పాజిటివ్ కేసులు వచ్చిన కర్నూలు రోజా వీధి, అవుకు, బనాగానిపల్లె లలో ముందు జాగ్రత్తగా కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులైన మునిసిపల్ కమీషనర్లు, డాక్టర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్ గా ఉన్న తహసీల్దార్ లు, ఎంపిడిఓ లను, పోలీసులను ఆదేశించామని, వారికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ గురువారం రాత్రి విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
కర్నూలు నగర పాలక సంస్థ పరిధి లో ఉన్న రోజా వీధి, బనాగనిపల్లె, అవుకులో ఒక్కొక్కటి చొప్పున మూడు కోవిడ్-19 ప్రెజెంప్టివ్ పాజిటివ్ కేసులు వచ్చాయని, కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అజీముద్దీన్ నగర్ లో జమాత్ నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చిందని కలెక్టర్ వివరించారు.
ఇదివరకే నొసం లో ఒక పాజిటివ్ కేసు వచ్చిన రాజస్థాన్ యువకుడికి చికిత్స చేసిన కర్నూలు జిజిహెచ్ పిజి డాక్టర్ కు కరోనా టెస్ట్ నెగటివ్ వచ్చిందని, పాజిటివ్ వచ్చిన నొసం/రాజస్థాన్ యువకుడు కూడా కరోనా నుండి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారని కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.
కోవిడ్ -19 ప్రెజంప్టివ్ పాజిటివ్ కేస్ ప్రోటోకాల్ ప్రకారం రోజా వీధి 3 కి.మీ.చుట్టూ కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్ గా, 5 కి.మీ.చుట్టూ కోవిడ్-19 బఫర్ జోన్ గా, అలాగే ప్రెజంప్టివ్ పాజిటివ్ కేసులు ఒక్కోక్కటి వచ్చిన బనగానిపల్లె , అవుకు లలో 3 కి.మీ.చుట్టూ కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్ గా , 7 కి.మీ.చుట్టూ కోవిడ్-19 బఫర్ జోన్ గా భావించి అన్ని ముందు జాగ్రత్తల చర్యలను చేపట్టాలని మెడికల్, మునిసిపల్, రెవెన్యూ, పీఆర్, పోలీస్ శాఖల స్థానిక అధికారులను ఆదేశించామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
అలాగే, కరోనా ప్రెజెంప్టివ్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం రాకపోకలను కట్టడి చేశామని, నిత్యావసరాలకు ఇబ్బంది లేదని, ఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయించామని కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.
ప్రెజెంప్టివ్ పాజిటివ్ వచ్చిన ఒక్కొక్క ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో ఉన్న వారికి డాక్టర్లు, ఎం హెచ్ఓ లు, ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, వాలంటీర్లతో సెక్టార్ కు ఒక వైద్య బృందాలను ఏర్పాటు చేసి మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం అని, ఆ ప్రాంతమంతా క్రిమి సంహార రసాయనాల స్ప్రే చేయించి.. టోటల్ శానిటేషన్ చేయిస్తున్నాం అని, జాగ్రత్తలు పాటించాలని మైక్ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దు అని, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే సమీప మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్, ఇన్సిడెండ్ కమాండర్/ తహశీల్దార్, ఎంపిడిఓ లకు సమాచారం ఇవ్వాలని, కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని, కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్ఛని కూడా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని , ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా మీడియా ద్వారా తెలియచేస్తామని, అందరూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటామని , అందరూ కలిసి కట్టుగా కరోనా విపత్తును ఎదుర్కొని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దామని కలెక్టర్ వీరపాండియన్ కోరారు. ప్రజలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, గ్రామాన్ని , వార్డులను సందర్శించే వివిధ శాఖల సిబ్బంది, మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, అధికారులు అందరూ అన్ని జాగ్రత్తలను పగడ్బందీగా తీసుకోవాలని సూచించామని కలెక్టర్ జి. వీరపాండియన్ వివరించారు.
———————————–
Issued by DD I&PR Kurnool