లాక్డౌన్ ఎత్తివేసే వరకు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు సూచించారు.
ఈ రోజ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్, గురుబ్రహ్మ నగర్ బస్తీలోని పేదలకు నిత్యావసర వస్తువులను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆయన మాట్లాడారు.
కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించిన జాగ్రత్తలు ముఖానికి మాస్కులు ధరిస్తూ, చేతులను సబ్బుతో 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లను వాడాలని మరియు గుంపులుగా, సమూహాలుగా తిరగరాదని, సామాజిక దూరం లాంటి సూచనలను ప్రజలందరూ తప్పకుండా పాటించాలంటూ మాట్లాడం జరిగింది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలనా యంత్రాంగం వెంటనే పారిశుద్ధ్య సంబంధిత చర్యలు చేపట్టాలని డ్రెయినేజీ, రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లాలని జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ దాసోజుతో పాటుగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. వెంకటేష్, కాటూరి రమేష్, తదితరులు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ జరిగింది.