కరోనా వైరస్ నుంచి పిల్లలు తొందరగా కోలుకుంటారు, నిజామా? : తాజా రీసెర్చ్

(TTN Desk)
కరోనావైరస్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అందుకే కరొనా మీద ఉన్న చాలా అనుమానాలకు సమాధానం లేదు.
అయితే, ఒక వైపు వ్యాధితో ప్రజలు వేలలో చనిపోతున్నా, కరొనా వైరస్ ప్రవర్తన మీద పరిశోధనలు కూడా సాగుతున్నాయి. ఈ మహమ్మారి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆసుపత్రులన్నీ మరొక వైపు ల్యాబొరేటరీలయిపోయాయి. కష్టాల్లోనే విజ్ఞానం కూడా విస్తరిస్తూ వచ్చింది.
పసిపిల్లల్లో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటమో, లేదా వారు తొందరగా కోలుకోవడమో లేదా వాళ్లలో అసలు రోగ లక్షణాలనే కనిపించకపోవడమో జరిగింది. ఈ ఇది శాస్త్రవేత్తల కంట పడింది.
దీనితో పసిపిల్లల్లో కరోనా వైరస్ ప్రభావం మీద పరిశోధనలు మొదలయ్యాయి.  ఒక భారీ పరిశోధన చైనాలో జరిగింది.
ఇది, చైనా వూహాన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నపుడు పిసిపిల్లలు ఈ జబ్బు నుంచి సులభంగా కోలుకోవడాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. తాము చూస్తున్నది నిజమవునో కాదో తెలుసుకునేందుకు పరిశోధన మొదలుపెట్టారు. ఈ జబ్బు బారిన పడిన పిలలలో మరణాలు చాలా చాలా తక్కువ గా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది.

Think your friends would be interested? Pl share this story

చైనా కొన్ని వేల మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. అయితే, ఇందులో పిల్లలు ఇద్దరంటే ఇద్దరు మాత్రమే. ఇందులో కూడా ఒకరు అప్పటికే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల వూహాన్ ఆసుపత్రిలో చేరారు. కేవలం కరోనావైరస్ దాడి వల్ల చనిపోయింది ఒక ఒక్కరు. ఇదే దురదృష్టం.ఆ బాలుడి వయసు 14 సంవత్సరాలు.
పసిపిల్లలు తల్లితండ్రులకే కాదు, దేశానికి కూడా సంపద. పిల్లలు జబ్బు పడితే ఇల్లంతా అశాంతి అలుముకుంటుంది. అందువల్ల తల్లితండ్రులు పిల్లలను కాపాడుకునేందుకు, వారు ఆరోగ్యంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారు. పెద్దగా శాస్త్రవిజ్ఞానం లేనందున కరోనా ఉపద్రవ సమయంలో పిల్లల గురించి అంతా ఆందోళన చెందుతున్న సమయంలో పిల్లల్లో ఈ జబ్బు పెద్ద గా ప్రభావం చూపదనే వార్త చాలా మంచి వార్త. అందుకే ఈ రీసెర్చ్ పేపర్ కు చాలా పేరొచ్చింది. విపరీతంతా సర్క్యులేట్ అయింది. ఎక్కువ శాంపిల్ తీసుకున్నందున ఈ రీసెర్చ్ ఫలితాలకు మంచి విశ్వసనీయత కూడా వచ్చింది.
చైనాలోని షాంఘై చిల్డ్రెన్స్ మెడికల్ సెంటర్ (Shanghai Chiledren’s Medical Centre), జియావో టాంగ్ యూనివర్శటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, షాంఘైకు చెందిన ప్రొఫెసర్ ఎస్ టాంగ్ (Prof S Tong) నాయకత్వంలో ఆరుగురు శాస్త్రవేత్తల బృందం ఈపరిశోధన  చేసింది.
ఈ పరిశోధనా ఫలితాలు Epidemioloty of COVID-19 among children in China అనే టైటిల్ తో Americal Academy of Pediatrics జర్నల్ లో అచ్చయ్యాయి. ఆసక్తి ఉన్న వారు ఈ రీసెర్చ్ పేపర్ ను ఇక్కడ చదవవచ్చు.
పరిశోధన
జనవరి 16,2020 నుంచి ఫిబ్రవరి8 దాకా కరొనావైరస్ సోకడం ( లేదా అనుమానం)తో ఉన్న 2143 కేసులను ఈ పరిశోధన కోసం సేకరించారు. చైనీస్ సెంబర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ నుంచి వైరస్ బాధితులను వివరాలను సేకరించారు. ఈ పరిశోధన కోసం ఎంచుకున్న పిల్లల్లో కొందరు జర్వం, అలసట, వొంటి నొప్పులు, దగ్గు, గొంతుమంట, పడిశెం, తుమ్ములతో బాధపడ్తున్నారు. మరికొందరిలో స్వల్పంగా న్యూమోనియా, తరచూ జర్వం, వూపిరి బాగా పీల్చుకోలేకపోవడం, కొద్దిగా దగ్గుతో బాధపడ్తున్నారు. మొత్తానికి 90 శాతం మందిలో ఏదో ఒక విధమయిన వ్యాధిలక్షణాలు కనిపించాయి. ఏ వ్యాధి లక్షణాలు లేని వాళ్లు కూడా శాంపిల్ లో ఉన్నారు. వారు బాగా తక్కువ.
పరిశోధన విశేషం
 ఈ పిల్లలంతా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా కోలుకోవడం శాస్త్రవేత్తలు గమనించారు. పిల్ల ల్లో లింగబేధం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఇతర వైరస్ లలాగే కరోనా వైరస్ కూడా అందరికి సోకుతుంది.
అయితే, వీరిలో కోలుకునే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి.
మొత్తం శాంపిల్ లో నాలుగు శాతం మందికి వైరస్ సోకినా ఎలాంటి వ్యాధి లక్షణాలు బయపడలేదు. ఎంపిక చేసుకున్న 2143 మంది పిల్లల్లో 125 మంది అంటే 6 శాతం పిల్లలో మాత్రం వ్యాధి తీవ్రమయింది. వీళ్ల విషయంలో వ్యాధి బాగా ముదిరి శీరరంలోని ఇతర అంగాలకు అంటే జీర్ణ వ్యవస్థకు, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు కూడా వ్యాపించింది. ఇందులో 0.4 శాతం మంది, చాలా చాలా తక్కవ మందికి మల్టీ ఆర్గాన్, శ్వాస వ్యవస్థ విఫలం కావడంతో క్రిటికల్ కేర్ సపోర్టు అవసరమయింది. వారిలో ఎక్కువ మంది కోలుకున్నారు. దురదృష్ట వశాత్తు ఒక్కరే చనిపోయారు. అతని వయసు 14 సంవత్సాలు. కరోనా పాజిటివ్ అని పరీక్షలో నిర్ధారణ కూడా అయింది.
ఇది చాలా పెద్ద పరిశోధనాగా శాస్త్రవేత్తలు వర్ణిస్తున్నారు. అందువల్ల ఈ ఫలితాలు విశ్వసనీయంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం, ఈ జబ్బు పిసిపిల్లలకు సోకే అవకాశం ఉన్నా, వారు కోలుకునే అవకాశం, పెద్దవారిలో కంటే చాలా ఎక్కువ.
ఇలాంటి పరిశోధనలు ఇతర దేశాలనుంచి కూడా వస్తే, మరింత దృఢంగా మనం ‘ కరోనా వ్యాధి నుంచి పసిపిల్లలు పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువ’ అని నమ్మవచ్చు.
పిల్లలతో సమస్య
అయితే, పిల్లల విషయంలో ఒక చిక్కు సమస్య కూడా ఉంది. పిల్లల్లో వైరస్ ఉన్నా వారికి ప్రాణాపాయం లేదన్న ధీమా ఉన్నా వారి వల్ల వైరస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే వాళ్లను super spreaders అంటారు. పిల్లలను అదుపు చేయడం కష్టం. వాళ్లు ఇల్లిల్లూ తిరుగతారు. కాలనీ మొత్తం కలియతిరుగుతారు. ఇతర పిల్లలతో ఆడుకుంటారు. పోట్లాడతారు. కింద మీద పడి లేస్తుంటారు. పిల్లలని పెద్దవాళ్లు ముద్దాడం, ఎత్తుకోవడం, వొడిలో కూర్చోబెట్టుకోవడం… ఇలా చేస్తుంటారు. ఇవన్నీ కరోనా కాలంలో చాలా ప్రమాదకరమయిన ముచ్చట్లు. అందువల్ల పిల్లలనుంచి కుటంబ సభ్యులకు, జనసమూహానికి తొందరగా వైరస్ సోకుతుంది. ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వృద్ధులలో ఎక్కువ మంది తాతలు, అమ్మమ్మలే (Grandparents) పిల్లలతో ఎక్కు ముచ్చట్లాడే బంధువులే. అందుకే కరోనా కష్ట కాలంలో గ్రాండ్ పేరెంట్సని పిల్లలతో అడుకోనీయరాదని డాక్టర్లు చెబుతున్నారు.
చైనా అధ్యయనం లాగానే, మరొక అధ్యయనం కూడా పిల్లలకు కరోనా వైరస్ సోకినా వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోవడం కనిపించింది. ఈ పరిశోధనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన 1481 మంది నుంచి 113 మంది పిలల్లను ఎంపిక చేశారు. వీరిలో ఇతర వైరస్ ల వల్ల జబ్బు పడిన వారిని తీసేస్తే 53 మంది కరోనాభాధితులయిన పిల్లలు మిగిలారు. ఇతర వైరస్ దాడి చేసిన వారికంటే హ్యూమన్ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన వారిలో అనారోగ్యం తీవ్రత బాగా తక్కువ అని తెలిసింది. అంటే, పిల్లల్లో కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. వారు బాగా కోలుకుంటారని అర్థం. అయితే, అదే సమయంలో వారు ఇతరలకు ఈ జబ్బును చాలా సులభంగా వ్యాప్తి చేసే ప్రమాదమూ ఉంది.
ఈ పరిశోధన ను అమెరికాకు చెందిన శాస్త్ర వేత్తలు చేశారు. ప్రిల్ ఎమ్ ఎమ్ (Prill MM)ఇతర శాస్త్రవేత్తల తరఫున ఈ పరిశోధనా పత్రాన్ని రాశారు. ఆయన అట్లాంటలోని నేషనల్ సెంటర్ ఫర్ ఇమ్యూనేజేషన్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్(National Center for Immunization and Respiratory Diseases) లో పనిచేశారు
ఈ పరిశోధన పత్రం (Human Coronavirus in young children hospitalized for accute respiratory illness and asymptomatic controls) క్లుప్తంగా ఇక్కడ ఉంది. ఆసక్తి వున్న వారు చదవవచ్చు.