అమెరికాలో ఒక మైనర్ కరోనావైరస్ భారినపడి చనిపోయాడు. ఇది కరొనా మీద అనేక అపోహలను కొట్టి పడేసింది. ఇంతవరకు కరోనాపిల్లలకురాదని,కేవలం వృద్ధులను మాత్రమే పీడిస్తుందని, వారికే ప్రాణాపాయమనే ప్రచారం జరుగుతూ వచ్చింది. పిల్లలలో కరోనా తీవ్రంగా ఉండదని పత్రికలు రాశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడ ఇలాగా భావించింది. 19 సంవత్సరాలలోపు ఉన్నవారిలో కేవలం 2.5 శాతం మందిలో మాత్రమే ఈ జబ్బు కనిపించింది. వీరిలో పరిస్థితి తీవ్రమయింది కేవలం 0.2 శాతానికి . ఇక మృతులు నిల్.
దీనికి కారణం లేకపోలేదు. చైనాలో వేలాది మంది చనిపోయినా, అక్కడ నమోదయిన పిల్లవాడి కేసులు రెండే. అందువల్ల 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు కరోనా ముప్పులేదని ధీమాగా చెబుతూ వచ్చారు.
ఇందులో ఒకరు పదినెలలోపు పసిపిల్ల వాడు, మరొకరి వయసు 14 సంవత్సరా లోపు. పసిపిల్లవాడికి ముందే జబ్బులున్నాయి. దీనితో వాడిని వూహాన్ ఆసుపత్రిలో చేర్చారు. ఇకరెండో బాలుడు హూబే రాష్ట్రానికి చెందిన వాడు. అతను ఫిబ్రవరి 7 చనిపోయాడు. ఈ విషయాన్ని రీసెర్చ్ జర్నల్స్ ప్రచురించాయి.మొత్తంగా2143 మంది పిల్లలకు కరోనా సోకిందని ఈ జర్నల్స్ రాస్తున్నాయి.
ఇక యూరోప్ లో చనిపోతున్న వారిలో 15 సం. లోపు పిల్లలు లేరు. అందువల్ల పిల్లలజోలికి కరోనా వెళ్లదని అనుకున్నారు. ఇపుడు అమెరికా లోని ల్యాంక్యాస్టర్ కు చెందిన ఒక పిల్లవాడు చనిపోయాడు. దీనితో ఏ వయసు వారికైనా కరోనా వైరస్ సోకుతుందని ఇపుడు చెబుతున్నారు.
అమెరికా కరోనాతో సతమవుతూ ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి అమెరికా కరోనా పాజిటివ్ కేసులు 52,976కు చేరాయి. మృతుల సంఖ్య 704 కు చేరింది. మిగతా అమెరికారాష్ట్రాలకంటే న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా అయిదు రెట్లు ఎక్కువగాఉంది.
అమెరికాలో 43 శాతం జనాభాను ఇంట్లో నే ఉండాలి కట్టడి చేస్తున్నారు. ఇది చైనాలో కరోనా కేంద్రంగా పేరున్న హూబైలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసేందుకు చ ర్య లుతీసుకుంటున్నారు.
ఇక న్యూయ్యార్స్ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ 25 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 210 మంది చనిపోయారు.ఆసుప్రతులలో పడకల కొరత తీవ్రంగా ఉందని న్యూయార్క్ గవర్నర్ యాండ్రూ కువోమో పేర్కొన్నారు. ప్రస్తుతం 53 వేల పడకలున్నాయి, రాష్ట్రానికి 1,40,000 పడకలు కావాలని, ఫెడరల్ ప్రభుత్వం ఆదుకోవాలసిందేనని ఆయన చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం లూయిసియానా, న్యూజెర్సీలలో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తా వుంది. మార్చి మధ్య దాకా లూయిసియానాలో కరోనా కేసులే లేవు. ఇపుబు 1388 కేసులున్నాయి. 46 మంది చనిపోయారు. ఇక న్యూజెర్సీలో 3675 కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం సోమవారం నుంచి మంగళవారానికే 800 కేసులు వచ్చాయి.ఇక్కడ 44 మంంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ప్రజలను గృహనిర్బంధంలో ఉండమన్నారు. ఇక్కడ పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంది.