కరోనావైరస్ గాలిలో ప్రవేశించాక ఏమవుతుంది?: రీసెర్చ్ రిజల్ట్స్

(TTN Desk)
కరోనా వైరస్ సాధారణంగా వ్యాధి గ్రస్థుని తాకడం వల్ల లేదా అతగాడు తుమ్మినా, దగ్గినా వచ్చే బిందువులు మన పడినా, వాటిని మనం పీల్చుకోవడం వల్ల మరొక వ్యక్తి వస్తుంది. గాలి తేలుతూ కరోనా వైరస్ లు దూరంగా ప్రయాణించి మన మీద దాడి చేయడం జరగదు, అది కష్టమని ఒక పరిశోధన వెల్లడించింది. అంటే కరోనా వైరస్ గాలిలో చాలా దూరం ప్రయాణించలేదు.
ఒక వ్యక్తి దగ్గినపుడు దాదాపు 3 వేల నీటిబిందువు (droplets)లు బయటకు చిమ్మబడతాయి. తుమ్మినపుడు వీటి సంఖ్య పదివేల దాకా ఉంటుంది. ఈ బిందువులు పక్కనే ఉన్న వారి మీద పడటం,వాటి ని వాళ్లుపీల్చుకోవడంతో వీటిలో ఉన్న వైరస్ అతని వూపరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. లేదా నోటీ ద్వారా, కళ్ల, చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
కరోనా వైరస్ ఈ రకంగా సంకమ్రించడాన్ని “droplet spread” అంటారు. ఈ డ్రాప్స్ లోనే కరోనా వైరస్ ఉంటుంది. ఈ డ్రాప్స్ గాలిలోకి ఎగిరిపడతాయి.అపుడు సమీపంలో ఎవరూ లేకపోతే ఏమవుతుంది?
కరోనా వైరస్ గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించలేదు. కొద్ది దూరం పోగానే భ్యూమ్యాకర్షణ కు లోనై గాల్లోంచి భూమ్మీద పడిపోతుంది.చచ్చిపోతుంది.

Like this story, share with a friend to promote responsible journalism

అయితే, ఇలా తుమ్మినపుడు లేదా దగ్గినపుడు కుప్పలు కుప్పలుగా బయకు చిమ్ముకొచ్చిన చీమిడి, లేదా ఎంగిలి డ్రాప్స్ లో దాక్కుని ఉన్న కరోనా బయటకు వస్తుంది కదా. అపుడు అది ఎంత సైపు గాలిలో సజీవంగా ఉంటుందనేది ఇంకా పరిశోధనలో ఉంది. అయితే, ఈ లోపు కొన్ని ప్రాథమిక ఫలితాలు వెల్లడయ్యాయి. అవి  రీసెర్స్ జర్నల్స్ లో అచ్చాయ్యాయి.  (ఆ ఒరిజినల్ సోర్స్ నుంచే మీకు ఈ సమాచారం అందిస్తున్నాం.)
న్యూఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ( New England Journal of Medicine) లో అచ్చయిన ఒక పరిశోధనా పత్రం గాలిలో కరోనా వైరస్ ఎంతసేపు ఉంటుంది, ఏ ఉపరితలం ( కాపర్, స్ట్లీల్, ప్లాస్లిక్… ఇలా) ఎంతసేపు ఉంటుందనే మీద ఆసక్తికరమయిన విషయాలు వెల్లడించింది. ఈ విషయాలు ఇక్కడున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్లు చదవవచ్చు.
కార్డు బోర్డు ఎక్కువ సేపు వైరస్ ఉండలేదు. కాపర్, స్టీల్ ఉపరితలం మీద ఎక్కువ సేపు ఉంటుందని ఈ  పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు గమనించారు.
వైరస్ సోకిన వ్యక్తి రెండు మూడు మీటర్ల దూరాన ఉన్నపుడు అతగాడు దగ్గినా, తుమ్మినా మన మీద డ్రాప్స్ పడవు. అందుకే ప్రభుత్వాలు social distance ఉండేలా చూడాలని చెబుతున్నాయి.
మరొక పరిశోధన ప్రకారం, తుమ్మినపుడు వచ్చే వైరస్ డ్రాప్ లెట్స్ గాలిలో కొద్దిసేపు ఉండే అవకాశం ఉందని అమెరికా ప్రిన్స్ టన్ యూనివర్శీటీ శాస్త్రవేత్తలు, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చాలా ప్రాథమిక పరిశోధనలే. ఈ పరిశోధనా పత్రం ఇక్కడ ఉంది.
ఎరొసోల్ (Aerosol) అంటే ఏమిటి?
ఒక వైరస్ గాల్లోకి ప్రవేశించి తెలుతూ తూలుతూ తిరుగుతూ ఉందనుకోండి దానిని ఏరోసోల్ అంటారు. అంటే, చాలా సూక్ష్మ పరిమాణంలో ఉండే నీటి బిందువుల్లో దాక్కుని ఇది గాలిలో తేలుతూ ఉంటుంది. తుమ్మినపుడు వచ్చే డ్రాప్ లెట్స్ లో పెద్దవి కింద రాలి పడిపోగా, చిన్నవి ఇంకా కొద్ది సేపు గాలిలోనే తేలుతూ ఉంటాయి. అపుడు గాలి వేగం తక్కువగా ఉండి, ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండి. బహిరంగప్రదేశమయితే ఈ వైరస్ అక్కడ కొద్ది సేపు తేలుతూ ఉంటుంది.
ఉదాహరణకు మీజల్స్ (measles) వైరస్ గాలిలో రెండు గంటల దాకా తేలుతూ ఉంటుంది. ఈ లోపు ఎవరైనా మనిషి అటువైపు వచ్చి ఈ గాలి పీల్చుకుంటే అది అతనికి అంటుకుంటుంది.
కరొనా వైరస్ కూడా గాలిలో దాదాపు ఇలాగే ప్రవర్తిస్తుందని ఇప్పటి ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి.
ల్యాబొరేటరీ కండిషన్సలో ఇది కూడా ఏరొసోల్ లాగా పనిచేసిందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. రియల్ వరల్డ్ స్డడీస్ ను ఆసుపత్రి గదుల్లో కరోనా రోగులున్నపుడు పరిశీలించారు. ఈపరిశోధనల్లో ఇవి గాలిలో ఎక్కువ కాలం ఉండలేవని తెలిసింది.
తుమ్మినపుడు, దగ్గినపుడు బయటకు వచ్చే నీటి బిందువులు ఏదైనా వస్తువు మీద పడినపుడు అక్కడ కరోనా వైరస్ ఎంతసేపు ఉంటుంది?
NIH (National Institute of Health) అధ్యయనం ప్రకారం, కార్డబోర్డు మీద వైరస్ పడినపుడు అది 24 గంటల దాకా సజీవంగా ఉంటుంది. ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ మీద పడినపుడు మూడు రోజుల దాకా తను దాడి చేసేందుకు ఎవరైనా బకరా వస్తాడా అని కాచుకుని ఉంటుంది. ఈ పరిశోధన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఏదేని ఉపరితలం మీద పడినపుడు గాలిలో కంటే ఎక్కువ కాలం ఉండేందుకు కారణం ఏమిటి?
వైరస్ గాలిలో ఎక్కువ సేపు ఎగురుతూ ఉండలేదు. దీనికి కారణం భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణకు గురై వైరస్ భూమ్మీది పడిపోతుంది. వ్యాపక శక్తి ని కోల్పోతుంది.
అదే ఉపరితలం మీద పడినపుడు భ్యూమ్యాకర్షణ ప్రభావం లేదు. ఎటొచ్చిఎవరో ఒకరు తాకడమే ఆలస్యం.
అలా తాకినపుడు చేతికి అంటుకుంటుంది. ఈ చేయి ముఖాన్ని, ముక్కును, కళ్లను, చెవులను తాకినపుడు వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల బయటకు వెళ్లి రాగానే చేతులను సబ్బుతోనే, హ్యాండ్ వాష్ తో గాని కడుక్కోవాలి. సబ్బు వల్ల , హ్యాండ్ వాష్ లో ఉండే ఆల్కహాల్ వల్ల వైరస్ రక్ణణ పొర కరిగిపోతుంది. వైరస్ చచ్చిపోతుంది.

https://trendingtelugunews.com/telugu/breaking/first-teenager-dies-of-corona-in-the-us/