కరోనాను కట్టడి చేసేందుకు దేశప్రలంతా 21 రోజుల గృహనిర్బంధాన్ని పాటించడం తప్పని సరి అని ప్రధాని నరేంద్ర మోదీ జాతిను ద్దేశించి ప్రసంగిస్తూ పిలుపు నిచ్చారు.
వారంరోజులలో ఇది ఆయన ప్రజలకు కరోనా హెచ్చరిక చేయడం ఇది రెండో సారి.
ప్రధాని ప్రసంగం విశేషాలు:
మీరంతా మార్చి 22న జనతా కర్ఫ్యూ ను ఖచ్చితంగా పాటించారు
ఇక కరోనా వైరస్ వ్యాపిని అడ్డుకొని తీరాలి.దీనిని అడ్డుకునేందుకు వచ్చే 21 రోజులు చాలా కీలకమయినవి. ఈ అవకాశం దాటితే, దేశం మరొక 21 సంవత్సరాలు వెనకబడుతుంది.
కరోనా తీవ్రత పెరిగితే పరిస్థితి భయంకరంగా ఉంటుంది
అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాని ఎదుర్కోలేకపోతున్నాయి
ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులోకి వస్తున్నది.
ఇల్లు విడిచి బయటకు రావడం మీద నిషేధం. కొొతమంది బాధ్యతా రహితంగాప్రవర్తిస్తే దాని పర్యవసానాలు జాతిమొత్తానికి తగులుతాయి. ఇలాంటి బాధ్యత రహిత ప్రవర్తనకు దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
21 రోజులు లాక్ డౌన్ ఉంటుంది, తప్పని సరిగాపాటించాలి. మీ ఇంటికి లక్ష్మణ రేఖ రాసుకోండి. ఈ రేఖను దాటి వస్తే కరోనా మహమ్మారి మీ ఇంట ప్రవేశించినట్లే.
ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం
ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్ డౌన్
ప్రతి ఒక్కరినీచేతులెత్తి వేడుకుంటున్నాను, లాక్ డౌన్ పాటించాలి.
లాక్ డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ
ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది
ఒక రకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూ ని మించి ప్రజలంతా మరొక పని చేయాలి…అదేమిటంటే ఇళ్లలోనే ఉండాలి అనేది.
బయటకు వెళ్లాడమనేది ఈ 21 రోజులు మర్చిపొండి
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విస్తరిస్తావుంది. ఒక మనిషిలోకికరోనా ప్రవేశిస్తే అతని నుంచి కొన్ని వేల మందికి వ్యాపిస్తుందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ ఉంది. మొదట ఒక లక్ష మందికి వైరస్ సోకేందుకు 67 రోజులు పట్టింది. తర్వాతమరొక లక్ష మందికి వ్యాపించేందుకు కేవలం 10 రోజులు పట్టింది. ఈ పరిస్థిని నివారించేందుకే 21 రోజుల లాక్ డౌన్.
కరోనను అరికట్టాలంటే సోషల్ డిస్టేన్సే మార్గం.
కరోనా ఎలా వ్యాపిస్తుందో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం
ఒక వ్యక్తి ద్వారా వేల మందికి వైరస్ వ్యాపిస్తుంది
కరోనా లక్షణాలు ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించండి
వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దు
కరోనా నియంత్రణ కుఅవసరమయిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.15 వేల కోట్లు విడుదలచేస్తున్నాం.