విజయవాడలో లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం అవ్వాలి నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే…
గుంపులుగా బయట తిరిగితే ఉపేక్షించేది లేదు.
ఇప్పటికే మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.
ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాము.
మా సిబ్బంది ఆరోగ్యం దృష్టా కొన్ని ఆదేశాలు జారీ చేశాము.
రక్షణ ఏర్పాట్లు చేసుకుని విధులు నిర్వహించాలని కోరాము.
ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మైక్ ప్రచారాలు చేస్తున్నాము.
కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా ప్రజలు పోలీసులకు సహకరించాలి.
విజయవాడలో కఠినంగా ఆంక్షల అమలు
విజయ వాడ వన్‌టౌన్‌లోని మేకావారి వీధి నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని 30 కార్పొరేషన్ డివిజన్లలో (19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 47, 48, 49, 50, 51 డివిజన్లు ) ఎవరిని అనుమతించరు. ఇక్కడ 12 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. వన్‌టౌన్ యువకుడు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇలా కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఈ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొంందుతున్నాడు.
బాధితుడి కుటుంబ సభ్యులను, అతని స్నేహితుడిని సోమవారం ఉదయం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. లాక్డౌన్ వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉండవు
200 పడకలతో ఐసోలేషన్ వార్డు
విజయవాడలో 200 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు అందుబాటులో ఉంది.