ఈ సాయంకాలం జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగుతున్నపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు… ఆయన మాటల్లోనే…
నిన్న మనం పప్రధానమంత్రి తో పాటు మనం కూడా పిలుపునివ్వడం జరిగింది. చాలా గొప్పగా అద్భుతమైనది గా కొనసాగింది,ఎవరు ఇండ్ల నుండి బయటకు రాకుండా గొప్పగా చేశారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రం అద్భుతంగా చేశారు.మోడీ చెప్పినట్లు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
నాతోపాటు మా కుటుంబ సభ్యులు ఇతర మంత్రులు, అధికారులు సంఘీభావం తెలియజేశారు. నా తరుపున ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అభినందనలు తెలువుతున్న.
ఇక్కడ ఎం రాష్ట్రం గమనించ్చల్సిన అవసరం ఉంది ఇవాళ కూడా మరో 5 గురికి వచ్చింది మొత్తం 26 కు చేరుకుంది.విల్లు అందరూ కూడా ఇతర దేశాల నుండి వచ్చిన వారే.
ఈ రోజు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సంక్రమిస్తుంది కాబట్టి ఇవాళ చాలా అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాం ఇవాళ్టి నుండి అన్ని అంతర్జాతీయ విమానాలు బంద్ అయిపోతున్నాయి.అయితే ఇప్పటివరకు ఇతర దేశాల నుండి వచ్చేవారిని అందరిని క్వారన్ టైన్ లోకి పంపించాం ఇక్కడ కూడా ఒక్క వ్యక్తికి వచ్చింది కాబట్టి ఇంకా కఠినమైన చర్యలు చేపట్టాలి
ఇవాళ్టి లాగానే ఈనెల 31వ తేదీ వరకు కొనసాగించాలి అని అంటున్నాం అందరూ దీన్ని పాటించాలి దయచేసి.
ఏపిడెమిక్ డిసిస్ యాక్ట్ (1897) అమలు చేస్తున్నాం ,ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం. మార్చ్ 31 వ తేదీ వరకు ఎవరు కూడా బయటకు రావద్దు.ఎవరు కూడా గుమికుడొద్దు.
ఈ యాక్ట్ ప్రకారం 5 గురు కంటే ఎక్కువ మంది ఒక్కదగ్గర ఉండకూడదు.నిత్యావసర వస్తువుల విషయంలో కుటుంబం లో ఒక్కరికి అనుమతి ఉంటుంది.
కూలీలకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంటుంది. నెల రోజులకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం రేషన్ కార్డ్ ఉన్న ఒక్క వ్యక్తి 12 కేజీల బియ్యం అందజేస్తాం,దీనికి సంబంధించి సీఎస్ ఉత్తర్వులు కూడా ఇస్తారు.
3లక్షల 36 వేల టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం.1103 కోట్ల రూపాయల వాల్యూ.
ప్రతి రేషన్ కార్డ్ కు 15 వందల నగదు ఇస్తాం.ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ డ్యూటీ కి రావాల్సిన పని లేదు అత్యవసర పరిస్థితి ఉన్న ఉద్యోగులు మాత్రమే డ్యూటీ కి రావాలి పేపర్ వాల్యువేషన్ చేసేవారికి కూడా రిలీవ్ చేస్తున్నాం.
1897 యాక్ట్ ప్రకారం బిల్డింగ్,ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కూలీలకు ,ప్రభుత్వం,యజమాని చెల్లించాలి.
లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థలు ఉద్యోగులకు య్ వారం రోజుల డబ్బులు చెల్లించాలి.అంగన్ వాడి కేంద్రాలు క్లోజ్ చేసి వారికి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాం గర్భిణీ స్త్రీలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ తయ్యార్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
అత్యవసరము కానీ ఆపరేషన్ లు అన్ని క్లోజ్ చేస్తాం వైద్యులను మనం కాపాడుకోవాలి.వారిని మనం కాపాడుకోవాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం క్లోజ్ ఆటో లు,బస్ ఇతర రవాణా మొత్తం బంద్.
ఇది మొత్తం కూడా వైరస్ ను తరిమి కొట్టాలి కాబట్టి ఇవ్వన్నీ పాటించాలి.అన్ని రైల్ లు బందు చేశాం.ఎవరి ఇండ్లలో వారే ఉండాలి.
రాష్ట్ర సరిహద్దు లు క్లోజ్ చేస్తున్నాం,తెలంగాణ కోసం వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తాం.ప్రైవేట్ బస్ లు కూడా బంద్.
ప్రతి ఒక్కరికీ దయచేసి ఎవరి ఇండ్లలో వాళ్లే ఉండండి దయచేసి.అంబులెన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి దయచేసి ప్రజలను కోరుతున్న అందరూ సహాకరించాలి. వారం రోజులు ఇండ్లలో ఉంటే ఆ మహమ్మారి మనం తరిమికొట్టవచ్చు.
భయంకరంగా చెడగొట్టుకున్నారు ఇటలీ వాళ్ళు అలాంటి దుస్థితి మనకు రావద్దు అంటే మనకు మనం దూరంగా ఉంటే బెటర్.
ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మళ్ళీ దయచేసి చెప్తున్నా మీ దగ్గర్లోని అధికారులకు రిపోర్ట్ చేయండి.
హోమ్ క్వారన్తటైన్ లో ఉన్నవారు ఇంట్లోనే విదంగా ఉంచాము అందులో నుండి కొంతమంది దుర్మార్గులు బయట తిరుగుతున్నారు.వాళ్ళు మీకు మీరు ఇంట్లో నే ఉండండి దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా మీకు మీరు సెల్ఫ్ డిస్టన్స్ లో ఉండండి.
ప్రభుత్వం ఇంతమంచి వసతులు కల్పిస్తుంటే ఇబ్బంది ఏంది.6 వేల పై చిలుకు మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.