మళ్లీ మునిసిపల్ ఎన్నికల్లో జెసి ప్రభాకర్ రెడ్డి

 

తాడిపత్రి మునిసిపాలిటీ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నట్లుమా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విశేషాలు:

– పదవి ఆశించి పోటీ చేయడం లేదు. మెజార్టీ స్థానాలు వస్తే నగర నడిబొడ్డున సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు నిర్ణయించిన వారికే మున్సిపల్ చైర్మన్ గిరి అప్పగిస్తాం.

–  రాష్ట్రంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న మున్సిపాలిటీ మురికి కూపంగా మారింది.“చెత్త” ట్రాక్టర్లు నా హయంలో ప్రతిరోజు ఇంటింటికి వచ్చి చెత్త సేకరించేవి. ఇప్పుడు వారానికి ఒక్క రోజైనా చెత్త ట్రాక్టర్ వస్తున్నదా?
– మన తాడిపత్రిలో ఎప్పుడైనా పందులు మందలు మందలుగా తిరగడం చూశారా?

ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఎక్కడైనా మీ వద్ద నుండి టాక్స్” అధికార పార్టీ మామూళ్లు” వసూలు చేశానా?

– జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకున్న తాడిపత్రి మున్సిపాలిటీ ప్రస్తుతం కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉండడం బాధాకరం.

తాడిపత్రి ప్రజలతో కాస్త కఠినంగా వ్యవహరించిన మాట వాస్తవం. అయితే తాడిపత్రి అభివృద్ధి కోసమే ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది . అంతేకానీ ఎవరి మీద ద్వేషం, కోపం లేదు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ప్రజలతో మమేకమై తాడిపత్రి అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా, వారి స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రయ త్నిస్తా.