మాచర్ల : ఈ రోజు గుంటూరు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న, హైకోర్టు న్యాయవాది కిశోర్‌లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేతల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తప్పించుకుని టీడీపీ నేతలు అక్కడి నుంచి నల్గొండకు వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. లాయర్ కిశోర్‌తో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కిశోర్ మాట్లాడుతూ.. దాడి ఎలా జరిగిందో లాయర్ కిశోర్ వివరించారు:
‘‘తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయ సలహా ఇవ్వడానికి మేం మాచర్ల వెళ్లాం.మా వెనక కార్లో బొండా ఉమా, బుద్దా వెంకన్న ఉన్నారు. అయితే, అక్కడున్న వైసీపీ కార్యకర్తలు మా వాహనాలపై దాడి చేశారు. నాకు కూడా గాయమైంది, రక్తంకారుతూ ఉంది. కాని, మా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి అక్కడి నుంచి నల్లగొండకు కారును తీసుకెళ్లారు. మేం నాగార్జున సాగర్ మీదుగా నల్లగొండ చేరుకున్నాం. వారు 10 వాహనాలతో మమ్మల్ని వెంబడిస్తుూ వచ్చారు.”
మాచర్లలో తమపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, దాడి నుంచి బతికబయటపడతామన్న నమ్మకం కూడా లేకుండా ఉండిందని బోండా ఉమ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమ గన్‌మెన్‌పై కూడా దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. వెల్దుర్తిలో డీఎస్పీ వాహనంలో తాము వెళ్తుంటే వైసిపి కార్యకర్తులు మళ్లీ అడ్డుకున్నారని.. డీఎస్పీపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన చెప్పారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని బోండా ఉమ వెల్లడించారు.
డిజిపి స్పందన