కరోనాకు కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, పరిశీలించేందుకు తెలంగాణ టీమ్ ఒకటి కేరళ వెళ్లింది.
టీం లో 5 మంది సభ్యులున్నారు.
వారిలో ఇద్దరు డాక్టర్లు, ఒక్కరు టిఎస్ఐ మెడిసిన్,ఒకరు ఐఎఎస్ అధికారి, ఒక మున్సిపల్ అధికారి ఉన్నారు.
కేరళ లో మూడు పాజిటివ్ కేసులను విజయవంతంగా నయం చేసిన సంగతి తెలిసిందే. దీనితో కేరళ కు మంచిగుర్తింపు వచ్చింది. అందువల్ల అక్కడి ఐసోలేషన్ వార్డ్స్ ఎలా ఉన్నాయి అక్కడి డాక్టర్స్ పాజిటివ్ వచ్చిన కేసులను నెగిటివ్ గా ఎలా మార్చ గలిగారో తెలుసుకునేందుకు తెలంగాణా టీం వెళ్లింది.
3 రోజుల పాటు కేరళ లోని వివిధ జిల్లాలో పర్యటించిన టీం అక్కడి ఆరోగ్యశాఖ చేసిన కార్యక్రమాలను పరిశీలించారు.
మంగళవారం దీనికి సంబంధించిన రిపోర్ట్ ను ఈ రోజు ఆరోగ్య శాఖకు నివేధించనున్నారు