మొన్నా మధ్య రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిజగన్ ని కుటుంబ సమేతంగా వచ్చి కలియగానే అది రాజ్యసభ సీటుకోసమేనని వాసన గుప్పు మంది.
ముఖేష్ మిత్రుడు పరిమళ్ నథ్వానీ కి రాజ్యసభ సీటు ఇవ్వాలని అభ్యర్థించేందు బిజెపి సలహా మేరకు ఆయన వైసిసి రాజ్యసభ ఇవ్వనుందని మీడియా రాసింది.
బిజెపి సలహా ఇచ్చిందో లేదో తెలియదు కాని, ముఖేష్ అంబానీ మిత్రుడిని ఆంధ్ర నుంచి రాజ్యసభ కు పంపేందుకు జగన్ అంగీకరించారు.
ముఖేష్ అనుచరుడు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు వైసిపి నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(మండలి విప్),విజయసాయి రెడ్డి (రాజ్యసభ సభ్యులు), బొత్స సత్యనారాయణ (మంత్రి) ప్రకటించారు. ఇందులోపిల్లి, మోపిదేవి ఇద్దకు ప్రస్తుతం ఎమ్మెల్సీలు. కౌన్సిల్ రద్దు ప్రతిపాదన ఉన్నందున వారిని రాజ్యసభకు పంపాలనినిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు.
6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిందని , అందువల్ల పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో నిర్ణయం అభ్యర్థుల పేర్లను ఖరారుచేయడం జరిగిందని వారు చెప్పారు.
50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని కూడా వారు చెప్పారు. రాజ్యసభకు నామినేట్ అవుతున్న పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ (ఇద్దరు బిసి), పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి( ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువు).
ఇక నాలుగో సీటు పరిమల్ నత్వాని ఇవ్వనున్నామని వారు తెలిపారు. ముఖే శ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి ఆయనకు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ నామినేషన్ కు ప్రతిఫలంగా ముఖేష్ అంబానీ ఆంధ్రలో పరిశ్రమల అబివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్ని నిర్ణయించినందుకు నథ్వానీ ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ట్విట్టర్ లో…
I sincerely thank Hon’ble Chief Minister Sh @ysjagan and his party @YSRCParty for considering me as their Rajya Sabha candidate from Andhra Pradesh. I am committed to serve the people of #AndhraPradesh. @PMOIndia @narendramodi @AmitShah #RajyaSabha pic.twitter.com/DEX3KE8Urb
— Parimal Nathwani (@mpparimal) March 9, 2020