అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడాదిన్నరగా పీజు రియంబర్స్ మెంటు జరగక రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. చాలా చోట్లవిద్యార్థులు దీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.
‘గత ఏడాది ఉన్న బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. మార్చి 30 నాటికి చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం,’ అని ఆయన ఈ రోజు ఉన్నత విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ప్రకటించారు.
ఇకనుంచి ప్రతి విద్యాసంవత్సరంలో త్రైమాసికం పూర్తవగానే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.
‘ఎప్పటికప్పుడు పీజులు చెల్లింపు చెస్తే కళాశాలలకూ మంచి జరుగుతుంది. అందుకే సస్టెయినబుల్ ఫీజు విధానం ఉండాలని ఆలోచిస్తున్నాం. ఇదే సమయంలో ప్రమాణాలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు కూ డా తీసుకుంటాం. ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేసి తీరాలి,’ ఆయన ముఖ్యమంత్రి చెప్పారు.