తెలంగాణ సిద్ధిపేట ఇప్పటికే దేశంలోనే ఒక విశష్టమయిన జిల్లా కేంద్రంగా తయారవుతూ ఉంది.ఇపుడు పట్టణం ప్రజలలో శుభ్రత అలవాటు చేసేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగారు.
ప్రజల్లో చెత్త గురించి, స్వచ్ఛత గురించి అవగాహన కల్పించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ ఉదయం సిద్దిపేటలో మార్నింగ్ వాక్ చేశారు.
స్వయంగా ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని మున్సిపాలిటి 5 వార్డుల్లో ప్రజలను కోరారు.
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు వేరు చేసి పట్టణం శుభ్రంగా వుండేందుకు ఇంటి దగ్గిరనుం చే కృషి మొదలు పెట్టాలని ఆయన కోరారు.
ఇందులో భాగంగానే అయ్యన స్వయంగా ప్రజలకు అవగాహన కల్పిస్తు సిద్దిపేటలోని 34, 33వ మున్సిపల్ వార్డుల్లో పర్యటించారు.
క్షేత్రస్థాయిలో ఇంటింటా తడి పొడి చెత్త లను వేర్వేరుగా ఎలా చేసి ఇవ్వాలో ఆయనే వివరించారు.
పలుచోట్ల తడి, పొడి చెత్త కనిపించడం, మురికి కాల్వల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లు నిండిపోయి ఉండటం హరీశ్ రావు గమనించా రు. వెంటనే ఆయన అక్కడి గృహాల మహిళలను పిలిచి చెత్త సేకరణకు వచ్చే వాహనాలకు ఇవ్వడం లేదా అంటూ ఆరా తీశారు.
మరో వైపు అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు జవాన్లను పిలిచి ప్రతి రోజు తడి చెత్త ఇస్తున్నారా? అంటూ వాకబు చేశారు.
‘ ఏ ఒక్కరి వల్ల వార్డులోని అందరికీ ఇబ్బందులు కలుగోద్దు. మేము ప్రతి రోజు అవగాహన, చైతన్యం చేస్తున్నా కొందరు చెత్తను ఇవ్వడం లేదని మా దృష్టికి వచ్చింది. మున్సిపాలిటీ సిబ్బందికి చెత్త ఇవ్వలేదంటే అది ఇంట్లో లేదా మురికి కాల్వల్లో పడుతున్నట్లు లెక్క. ఇలా జరిగితే స్వచ్చ సిద్ధిపేట ఏలా సాధ్యమైతుందని.. మీరే పరిష్కారం చెప్పాలి, ’ ఆయన మహిళలను ప్రశ్నించారు.
తర్వాత, చెత్త సేకరణకు సహకరించని వారికి బాధ్యత తెలియాలంటే భయం ఉండాలని, దానికి జరిమానాలు విధించాలని మహిళలు సూచించారు.
జరిమానాలు విధించాలనేది మా ఉద్దేశ్యం కాదని, మీలో మార్పు కోసమే మా ప్రయత్నమంటూ, అయినప్పటికీ మార్పు రాకపోతే.. జరిమానా తప్పదని మంత్రి వారికి వివరించారు.