తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవలి దాకా పనిచేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ మారారు. ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపిలోచేరారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ దళిత నాయకుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోచేరారు. ఆయనకు టిడిపి మంచి గౌరవమే ఇచ్చింది.వెంటనే పార్టీ అధికార ప్రతినిధిని చేసింది. తర్వాత ఆయనఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపివోడిపోయాక ఆయన కన్ను అధికార పార్టీ మీద పడింది. మొన్న జనవరి 21న కౌన్సిల్ కురాజీనామా చేశారు. కొద్ది రోజులు కామ్ గా ఉండి, ఇపుడాయన పార్టీ మారారు. వైసిపి లో చేరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ , 2014లోనే వైసిపిలో చేరాలనుకున్నానని, అయితే, వీలుపడలేదని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అపుడు తెలుగుదేశం పార్టీలో చేరానని, అయితే, అక్కడ సరైన గౌరవం లభించలేదని అన్నారు.
అయితే, కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా లేఖను ఆయన ఛెయిర్మన్ కు కాకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. నిజానికి , ఆ లెటర్ పంపడానికి గంట ముందు ఆయన కౌన్సి్ల్ లో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయం తప్పన్నారు. అంతేకాదు, ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలో పెట్టాలని మొదటు ప్రతిపాదించిన వారిలో తాను ఒకడినని కూడా చెప్పారు.
ఇపుడు మూడు రాజధానుల ప్రతిపాదన మీద ఏ మ్మాట్లాడతారో చూడాలి.