ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా వైరస్ పరిస్థితుల మీద బులెటీన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్‌ను ధరించాలని చెబుతూ కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని తెలియ చేసుందుకు కంట్రోల్ రూం ఎర్పాటు చేసింది. కంట్రోల్ రూం నంబరు (0866-2410978).
ఇదే విధంగా వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలి.
ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 378 మంది ప్రయాణికులు వచ్చారు. వారంతా వైద్యుల పరిశీలనలో ఉన్నారు. పేర్కొన్నారు. వారిలో 153 మంది ఇళ్లలోనే ఉన్నారు. వైద్యం తీసుకుంటున్నారు. కరోనా విస్తరించిన ఉన్న దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ్రస్కీనింగ్ చేస్తున్నారు. ఇలాగే కరోనాఆందోళనను సొమ్ముచేసుకోవాలనుకునే వారి మీద చర్య లుతీసుకుంటున్నారు.అధిక ధరలకు మాస్క్ లను, మందులు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
డ్రగ్స్ డీజీ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు.
ఈ వివరాలను అందిస్తూ మరొక 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి స్థిమితంగా ఉందని చెబుతూ 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు.
ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని ఆన వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.
మాస్కులను, మందులను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామన్నారు. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.