ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ తమిళసై వణక్కం అని తమిళంలో సమస్కరించడంతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజున వణక్కం అంటూ తెలుగు, తమిళ భాషల్లో చెప్పి ఇంగ్లీషులో లోకి మారారు.తెలంగాణలో తొందరలో పెన్షన్ వయోపరిమితిని 57 సం. లకు తగ్గించనున్నట్లు ఆమె ప్రకటించారు.
ఆమె ప్రసంగం విశేషాలు
60 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. ఉద్యమ నేత తెలంగాణ సీఎంగా ఉన్నారని ఆమె అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతోంది. చుక్క నీరులేని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పంట పండించింది. తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. కరెంట్, నీటి సమస్యను తెలంగాణ అధిగమించింది. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరువులను నిర్లక్ష్యానికి గురయ్యాయి. విద్య, వైద్యం, తాగు, సాగునీటి రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు వివక్షకు గురయ్యాయి.
తెలంగాణలో ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను ఎత్తివేత, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 969 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోన్నది. బీడీ కార్మికులు రూ.2016 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
ఆర్థికమాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అన్ని రాష్ట్రాల్లో వృద్ధి రేటు తిరోగమనంలో ఉంది. అయతే తెలంగాణ రాష్ట్రంలో అంత దుస్థితి రాలేదు. ఆకలి దప్పులు లేని… అనారోగ్యాలు లేని.. శతృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యం. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వేగంగా పూర్తి చేస్తున్నాము. కాళేశ్వరం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకమని, సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తాం. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తున్నాం . రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం. మిషన్ భగీరథతో మంచినీటి సమస్యను పరిష్కరించాం. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తాం. హైదరాబాద్లోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం . కంటి వెలుగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరిపాలనలో భాగంగా భారీగా సంస్కరణలు తీసుకువస్తూ కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చాము. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నాం.
టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం.
వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నం. వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పెన్షన్ ఇస్తున్నాం. చెప్పారు. ఒంటరి మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలోనే పెన్షనర్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తాము. ఉన్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం, 950 రెసిడెన్షియల్ స్కూళ్లను నడిపిస్తున్నాం. చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం, నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం.
యాదవులు, నేత కార్మికులను ఆదుకుంటున్నం. 125 చ.గజాల లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్లు ఇస్తున్నాం.