ఎన్నికలు వచ్చిన ప్రతిసారి BC ల రిజర్వేషన్ల పైకి ఏదో ఒక విధంగా చర్చ ను మళ్లించి వారిని మభ్యపెడుతున్నారు. నిజంగా ఈ రెండు పార్టీలకు 56 % శాతం ఉన్న BC ల ఓట్లు మాత్రమే కావాలి కాని వారి సంక్షేమం కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతుల నాగరాజు పేర్కొన్నారు.
వీళ్ళు ముఖ్యమంత్రి కావడానికి, వీళ్ల పార్టీ అధికారంలోకి రావడానికి BC లు కావాలి.కానీ BC ల అభివృద్ధి పైన గాని,సంక్షేమం పైన గాని ,వారి రాజకీయ అభివృద్ధి పైన గాని ఈ రెండు పార్టీలకు శ్రద్ధ లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో ఈ రెండు పార్టీల బిసి విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.
ఆయన ప్రసంగం విశేషాలు
’’చంద్రబాబు బీసీ ల పైన మొసలి కన్నీళ్లు కారుస్తూ BC లను రాజకీయంగా అణచివేత కు గురి చేస్తున్నారని, ఈ యన పాలనలో నే బీసీ రిజర్వేషన్లకు విద్యా, ఉద్యోగాలలో,మెడికల్ సీట్లలో అన్యాయం జరిగింది.
చంద్రబాబు మోసాలకు బీసీలు బలి కావద్దు అని జగన్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ని అన్ని బీసీ కులాలకు అనేక వాగ్దానాలు చేసిన పెద్ద మనిషి జగన్.
ప్రతి కులానికి ఒక ఫెడరేషన్, అని ,MLC పదవులు అని,బీసీ ల రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతామని చెప్పిన ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ లను అణచివేతకు గురిచేస్తుంటే ఇంతా కంటే మోసం ఏమైనా ఉన్నదా..జగన్ కు చంద్రబాబు కు బీసీ రిజర్వేషన్ల ను చిత్తశుద్ధి తో అమలు చేయాలని ఉంటే తమిళనాడు లో 69 % మహారాష్ట్ర లో68 % చత్తీస్ గఢ్ లో 72 % శాతం రిజర్వేషన్ల ను ఆ రాష్ట్ర లు అమలు చేస్తున్న విధానాన్ని ఎందుకు ఆంద్రప్రదేశ్ లో వీళ్ళు చేయడం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడము జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ 50 % శాతం సీట్ల ను బీసీ లకు కేటాయింపు చేయడం జరుగుతుందని. టీడీపి, వైస్సార్సీపీ లు యెంత శాతం సీట్ల ను కేటాయుస్తారో చెప్పాలని .SC, ST, ఉద్యోగుల పదోన్నతుల యందు ఉన్న రిజర్వేషన్లను కోర్టు ద్వారా రద్దు చేస్తామని కేంద్రం వైఖరిని ఎందుకు ఈ రెండు పార్టీలు కందించలేదు,CAA, NRC, NPR, లపై కూడా నోరు మెదపడం లేదు.అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం పట్ల పని చేసేది అని,ఈ ఎన్నికల లో TDP, వైస్సార్సీపీ లను ఓడించేందుకే BC, మైనారిటీ, SC, ST, లు అందరూ పని చేయాలి.‘‘
ఈ కార్యక్రమంలో నాయకులు వాసు,శుభాన్,రాజ్ కుమార్, రమేశ్, షణ్ముగా, తదితరులు పాల్గొన్నారు..