ఈ రోజు హైదరాబాద్ సమీపంలోని జన్వాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
జన్వాడ లోని కేటీఆర్ ఫామ్ దగ్గర కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిలను అరెస్టు చేశారు. అక్కడ 111 జీవోను తుంగలో తొక్కి అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని వారు ధర్నాకు దిగారు. 25 ఎకరాలను కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని వారు ఆరోపించారు.దీనికి సంబంధించిన ఫోటోలను చూపించారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధలన సీఎం కేసీఆర్-కేటీఆర్ అతిక్రమించారని, గండిపేట చేరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ ఫామ్ అక్రమంగా నిర్మించారని వారు ఆరోపించారు. విలాసవంతమైన ఫామ్ హౌస్ లో కేటీఆర్- సీఎం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వారుపేర్కొన్నారు.