దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటివద్దకే పెన్షన్ల పంపిణి చేసి ఏపీ సర్కార్ రికార్డు సృష్టిచింది. పెన్షన్ దారాలు ఆసమయానికి ఇంటి దగ్గిర లేకపోతే, ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడి వెళ్లి పెన్షన్ లు అందించి వేలి ముద్రలు సేకరించారు.చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా సరే వలంటీర్ ఆసుపత్రికే వెళ్లి పెన్షన్ ఇచ్చేశారు. ప్రతినెల ఒకటో తేదీన ఇక ముందు ఈ కార్యక్రమం ఇలాగే సాగుతుంది. సంక్షేమ ఫలితం ఇలా పకడ్బందీగా అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రికార్డు సృష్టించింది.
ఉదాహరణకు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ నల్లగుట్ట పల్లె కు చెందిన వృద్దుడు అనారోగ్యం ఉండడం వలన మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స కోసం పొందుతున్నాడు. ఫోన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న వాలంటీర్ ఆనంద్ అక్కడికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.(పై ఫోట)
మధ్యాహ్నం 2 గంటలకు 47 లక్షల పెన్షన్లు పంపిణీ చేసి 80శాతం టార్గెట్ పూర్తి చేశారు.
పెన్షన్ల పంపిణీపై సమీక్షా సమావేశాల్లో సీఎం ఆదేశాలు మొదటి తారీఖునే గడపవద్దకే పెన్షన్లు దాదాపుగా పూర్తికావాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరీ మారుమూల ప్రాంతాల్లో వీలుకాదు అనుకుంటే రెండోరోజున తప్పనిసరిగా పెన్షన్ ను అందించితీరాలన్నది ముఖ్యమంత్రి ఆదేశం. సాధ్యమయినంతవరకు మొదటితారీఖునే పెన్షన్ అందించే లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం పటిష్టమయిన ఏర్పాట్లు చేసింది.
పొద్దు పొడవకముందే పెన్షన్ల పంపిణీ ప్రారంభమయింది. పెన్షన్లకోసం క్యూలైన్లలో పడిగాపులు పడటానికి పూర్తిస్థాయిలో చెక్ పెడింది. గతంలో ఎక్కడి నుంచే వచ్చి, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వాళ్లు ఇలా క్యూలో నిలబడేందుకు చాలా ఇబ్బంది పడేశారు. ఆంధ్రలో ఈ అధ్యాయం ముగిసింది.
ఇక విజయవాడ లో…
విజయవాడ నగరంలో ని మూడు నియోజకవర్గ ల పరిధిలో ఆదివారం మధ్యాహ్నం వరకు 27029 మంది లబ్దిదారులకు రూ.6 కోట్ల 95 లక్షల 26 వేల పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
ఆదివారం విజయవాడలోని 6, 18 వార్డుల పరిధిలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాజిక భద్రతా పెన్షన్లు లబ్దిదారులకు ఇంటి దగ్గర ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నగరంలో మొత్తం 54,056 మంది లబ్ధిదారులకు వృధ్యాప్య, వితంతు, ప్రతిభావంతుల, చేనేత, డయాలసిస్, దీర్ఘకాలిక వ్యాధుల తదితర పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. మధ్యాహ్నం వరకు 54 శాతం మంది కి పెన్షన్లు వార్డ్ వాలంటీర్లు ద్వారా అందించడం జరిగిందని, సాయంత్రం వరకు దాదాపు పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అధికారులు వార్డ్ కార్యదర్సులు, వాలంటీర్లుని సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుల,మహిళల, ప్రతిభావంతుల, తదితరుల ఆత్మ గౌరవం కాపాడేలా ఇంటి దగ్గర వాలంటీర్లు వొచ్చి పెన్షన్ సొమ్ము ఒకటొవ తారీఖున ఇవ్వడం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.