గ్రామాలల్లో 24 గంటల క్లినిక్ లనేవి భారత దేశంలో ఎక్కడా ఉండవేమో. ఇలాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నది. ఇది అమలు అయితే, రాష్ట్రంలో ఆరోగ్య విప్లవం వచ్చినట్లే. ఢిల్లీ మెహల్లా క్లినిక్ ల్లాగా ఆంధ్రా 24 గంటల గ్రామాసుపత్రులకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ఆరోగ్యమనేది గ్రామాలలో చాలా పెద్ద సమస్య. డాక్టర్అందుబాటులో లేక, దూరాన పట్టణాలకు పోలేెక, పోయినా, అక్కడ డాక్టర్ ఫీజు చెల్లించలేక, ఒక వేళ్ల చెల్లించిన, ఆయన రాసిచ్చే ముందులు కొనే శక్తి లేక చాలా మంది రోగాలను దాచుకుని బతకుతుంటారు. వాళ్లకి గ్రామక్లినిక్ వర ప్రసాదం కాబోతున్నదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పిహెచ్ సి లు రాత్రిళ్లు పని చేయవు. అందువల్ల మామూలు జ్వరాలు కూడా గ్రామాల్లో ప్రజలను పీడిస్తూ ఉంటాయి. ఇలాంటి చోట్ల గ్రామాసుపత్రి రావడం అక్కడ స్టాఫ్ నర్స్ ఎపుడూఅందుబాటులో ఉండటం గొప్ప మార్పు అవుతుంది.
పల్లెల్లో మహిళలు మరీ ఎక్కువగా సమస్యలు దాచుకుంటూ ఉంటారు. పురుషుల కంటే ఎక్కువ బాధపడేది వారే. డాక్టర్లను సంప్రదించలేక జబ్బులు దాచుకుని లోలోన కుమిలి పోతుంటారు. ఇలాంటి వాాతావరణంలో గ్రామ క్లినిక్ లలో నర్సులను అందుబాటులో ఉంచడమనేది చాలా గొప్పవిషయం. ఈపథకం వల్ల మహిళలకు చాలా మేలు జరుగుతుంది.
ఇలా ఒక మంచిఆసుపత్రి అందుబాటులోకి వస్తే గ్రామ స్వరూపమే మారిపోతుంది.
ఈ రోజు ఇలాంటి గ్రామక్లినిక్ గురించి, రాష్ట్రంలో ఆరోగ్యవ్యవస్థను సమూలంగా మార్చేందుకు తీసుకురాబోతున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు.
ఈ సమీక్ష విశేషాలు:
ఈ గ్రామాసుపత్రి పేరు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రెండు వేల జనాభా ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్ క్లినిక్ ఏర్పాటవుతుంది. వైద్య సేవలను సాధ్యమయినంతవరకు డోర్ డెలివరీ చేసే కార్యక్రమంగా చేయాలి.
వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌లో 24 గంటలూ పనిచేస్తాయి. ఒక బియస్సీ నర్సింగ్ చదివిన నర్స్ ఎపుడూ అందుబాటులో ఉండాలి
ప్రతీ గ్రామ, వార్డు సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండాలి
విలేజ్ క్లినిక్ ని రెఫరల్ పాయింట్లా ఉండాలి రోగి ఎవరొచ్చినా క్లినిక్ రెఫరల్ పాయింట్లా పనిచేయాలి.అక్కడ
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్లా ఉండాలి. రోగికి ఏదైనా జరిగితే వెంటనే అక్కడికి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందనే విధంగా విలేజ్ క్లినిక్ ఉండాలి, పనిచేయాలి. డబ్బు ఖర్చు కాకుండా వైద్యం ఉచితంగా అందే ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలు కావాలి. ఎవరికైనా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయడం ఈ క్లినిక్ లక్ష్యం. చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్సలు, మందులు ఇవ్వడం, పెద్ద సమస్యలకు పెద్దాసుపత్రులకు రిఫర్ చేయడం జరగాలి.
ప్రతీ జిల్లాకు ఒక టీచింగ్ హస్పిటల్ ఉండాలి.25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఉండాలి.వీటిని ఏర్పాటు చేసేందుకు 7 మెడికల్ కాలేజీలకు డిపిఆర్లు సిద్దమవుతున్నాయి. టీచింగ్ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పక్కాగా ఏర్పాటుచేసుకోవాలి. డాక్టర్లు, నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.
ప్రతి టీచింగ్ హాస్పిట్ లో డెంటల్ విద్య
ప్రతి టీచింగ్ హాస్పిటల్లో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి.”డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు”పథకం కింద 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్ధులకు ఉచిత దంత వైద్యం చేయాలి. ప్రతీ విద్యార్దికి టూత్‌పేస్ట్, బ్రష్ ఉచితంగా ఇవ్వాలి.పిహెచ్‌సీలలో డెంటల్ చెకప్ కూడా ఉండాలి.60 లక్షల మంది చిన్నారులను డెంటల్ స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
కంటివెలుగు తరహాలో కార్యక్రమం సజావుగా సాగేలా ఉండాలి, ఎక్కడా అడ్డంకులు రాకూడదు.కంటివెలుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో పరిశీలించండి.కార్యక్రమం ప్రారంభించే ముందు పక్కగా ప్రణాళికలు సిద్దం చేయండి.జులై 8న డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు కార్యక్రమం ప్రారంభించండి