విశాఖలో చంద్రబాబు ముందస్తు అరెస్ట్‌

  రాష్ట్రంలో చర్చ మూడు రాజధానుల మీది నుంచి తన వైపు తిప్పుకోవడంలో తెలుగు దేశం పార్టీ  అధినేత చంద్రబాబు విజయవంతమవుతున్నారు.ఇంత వరకు ఆయన చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తెలుగు నాట తప్ప బయట పెద్ద గా ప్రచారం రాలేదు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను జాతీయ వార్తల కెక్కించింది.జాతీయస్థాయిలో బాాగాపేరున్న నాయకుల్లో చంద్రబాబు ఒకరు. దీనితో ఆయన జాతీయ స్థాయికెక్కడం చాలాసులభం. ఈరోజు ఆయనను  విశాఖపట్నం  పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేసి ఆయన ప్రజా చైతన్య యాత్ర ను జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.
 విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చంద్రబాబునాయుడు ఇంతవరకు రాష్ట్ర పర్యటన కు రాలేదు. జగన్ మూడు రాజధానులను ప్రకటించాక, దానిని వ్యతిరేకిస్తున్న ఆయన మూడు ప్రాంతాలలో తిరిగి మూడు రాజధానులు తప్పని,  అమరావతియే  అసలైన రాజధాని అని చెప్పి వప్పించే పరిస్థితి లేకుండా ఉండింది.  ఉత్తరాంధ్రలో పర్యటించలేదు.
ఇపుడు జగన్ విధానాల వల్ల భూములకోల్పోతున్న వారిని పరామర్శించే పేరుతో యాత్ర మొదలుపెట్టారు. అంటే ఆయన మూడు రాజధానులు చర్చను రైతుల మీదికి మళ్లించే ప్రయత్నం చేశారు. ఇది పెద్ద వార్త య్యేందుకు జగన్మోహన్ రెడ్డి వైసిపి సైన్యం బాగా సహకరించింది.
ఆయన పర్యటనకు పోలీసుల అనుమతి కూడా ఉంది. అయినా సరే వైసిసి కార్యకర్తులు చంద్రబాబు పర్యటనకు నిరసన తెలిపి మూడు రాజధానుల విషయాన్ని ముందుకు తెచ్చేందుకు ప్రయత్నం చేశారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/ysrc-toeing-the-line-of-tdp-in-opposing-chandrababu-yatra/

 

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో  ‘గో బ్యాక్‌ చంద్రబాబు..ఉత్తరాంధ్ర ద్రోహి’ అంటూ  పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వాహనాన్ని  అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున  ఉద్రిక్తత నెలకొంది. దీనితో  ఎయిర్‌పోర్టు,ఎన్‌ఏడీ జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టులోకి కొద్డీ మంది టిడిపి  నేతలను మాత్రమే అనుమతించారు.
ఈ  తీవ్ర ఉద్రిక్తత నడుమ చంద్రబాబును అదుపులోకి తీసుకుని పోలీసులు తిరిగి విశాఖ విమానాశ్రయం  వీఐపీ లాంజ్‌ కి తీసుకువెళ్లారు.
ఉదయం నుంచి విశాఖ విమానాశ్రయం వద్ద  చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైకాపా శ్రేణులు విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు.
చరిత్ర పునరావృతమా!
2017లో  విశాఖలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌కు ఎదురైన పరిస్థితే నేడు చంద్రబాబుకు కూడా ఎదురవుతున్నది. 2017 జనవరి 26న విశాఖపట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు  ప్రతిక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఐతే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.  భద్రతా కారణాల దృష్ట్యా జగన్, ఇతర వైసీపీ నేతలను అడ్డుకున్నట్లు పోలీసులు ఇదే భాష వాడారు. దీనికి నిరసనగా స్వయంగా జగన్‌ రోడ్డెక్కారు.   విజయసాయిరెడ్డి, వైబీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు లతో కలసి ఎయిర్‌పోర్టులో రన్‌వే పైనే బైఠాయించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని  హైదరాబాద్ తిప్పి పంపించారు.
ఇది ఇలా ఉంటే…
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నందుకు నిరసగా గుంటూరు  సత్తెనపల్లి లో రోడ్డుపై టిడిపి నేతులు  బైఠాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సత్తెనపల్లి తెదేపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.