ఈ రోజు ప్రకాశం జిల్లా బొప్పూడి నుంచి ప్రారంభమయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ప్రజా చైతన్య యాత్రకు విపరీతంగాస్పందన లభించింది. జనం తండోపతండాలుగా వచ్చారు. ఈ ఉత్సాహంతో ఆయన యాత్ర కొనసాగుతుంది. యాత్రను ఆయన బొప్పూడి అంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ప్రారంభించారు. యాత్రలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పిచ్చి తుగ్లక్ చేతిలో ఆంధ్రప్రదేశ్ పడిందని ఎద్దేవా చేశారు.దీనితో అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమం లేదని మాట్లాడుతూ తాను అధికారం కోసం కాదు, 9 జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చెప్పేందుకు వచ్చానని అన్నారు. ఒక్క సారి ఛాన్స్ అంటే ఓటేశారు.. దాని పర్యవసానం ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. యాత్ర చిత్ర మాలిక ఇది.
ఓటేసిన పుణ్యానికి ప్రజలను శిక్షిస్తున్నారు. గత 9 నెలల పాలనలో-
*ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లన్నీ రద్దు చేశారన్నారు. ఎక్కడైనా ఒక గంప మట్టి వేశారా? *టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం. వైసీపీ దొంగలు ఇనుకను అమ్ముకుంటున్నారన్నారు. * ఇసుక, సిమెంట్, మద్యం ధరలు పెంచేశారు. * జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్ల మద్యానికే అనుమతి. *కరెంట్ ఉండదు.. రాని కరెంట్‌కు ధరలు పెంచేశారు. * పీపీఏలను రద్దు చేశారు, సోలార్ విండ్‌ని సంక్షోభంలోకి నెట్టారు. బస్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచారు. *చివరికి ప్రజలు చొక్కా వేసుకున్నా.. పన్ను వేసేలా ఉన్నారు- అని చంద్రబాబు నాయుడు అన్నారు.