హైకోర్టు తరలింపు వివాదం ఇంకా కొనాసాగుతూఉంది. రెండు బెంచ్ లనుఅమరావతిలో, విశాఖ లో పెట్టి, కర్నూులో హైకోర్టు అంటే దాని ప్రాముఖ్యం ఏమీ ఉండదని రాయలసీమ వాసులు పెదవివిరుస్తున్నారు. అసలు హైకోర్టు తరలింపే ఇంకా తేలడం లేదు. ఇలాంటి సమయంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త ప్రతిపాదనను చేశారు. అంతేకాదు దానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా తగిలించారు.
రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
‘రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కోరిక . వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ, రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అంగీకరించారు.’ అని కూడా ఆయన గుర్తు చేశారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలంగా పార్టీ రాజకీయాలకుదూరంగా ఉంటున్నారు.అయితే, అపుడపుడు ఆయన ఇలా సంచలనం సృష్టిస్తూ ఉంటారు.