రైళ్లలో కొత్త సంప్రదాయం మొదలు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఆర్టీసిలో ఎమ్మెల్యేలకు, ఎంపిలకు పర్మనెంటుగా సీట్ నెంబర్ రిజర్వు చేసినట్లు రైళ్లలోఇంతవరకు శాశ్వతంగా ఎవరికీ సీట్లు కేటాయించలేదు. ఇపుడు తొలిసారి గా ఇది జరిగింది. నిన్న ప్రారంభమయిన ఐర్ సిటిసి మహాకాల్ ఎక్స్ ప్రెస్ లో ఒక సీటును శివుడికి రిజర్వు చేసి పెట్టింది. దీనితో వివాదం మొదలయింది.
ఎఐఎంఐఎం నేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ వొవైసీ దీని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు రైల్వేవారి ఏర్పాటు మీద స్పందిస్తూ ఆయన ఒక ట్వీట్ చేస్తూ రాజ్యాంగాన్ని గుర్తు చేశారు.
https://t.co/HCeC9QcfW9 pic.twitter.com/8sE5ht3rvJ
— Asaduddin Owaisi (@asadowaisi) February 17, 2020
ఈ రైలును నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. రెండు రాష్ట్రాలల్లోని మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూఈ రైలును రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్ సిటిసి నడుపుతుంది. ఈ సంస్థ నడుపుతున్న రైళ్లలో ఇది మూడవది. ఇందులో బి-5 కోచ్ లో సీట్ నెంబర్ 64ను శివుడికి రిజర్వు చేశారు. భారత రైల్వే చరిత్రలో ఇలా దేవుడికి ఒక సీటును రిజర్వు చేయడం అనేది ఎపుడూ జరగలేదు. ఇదే మొదటి సారి.
Take a look at the newly inaugurated Kashi Mahakal Express, with its clean & hygienic pantry for providing high quality vegetarian food to passengers.
Also, facilities such as bedrolls, houskeeping and travel insurance is going to make the journey convenient & pleasant for all. pic.twitter.com/KbTkxSQ8rK
— Piyush Goyal (@PiyushGoyal) February 16, 2020