ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఆగరాల ఈశ్వర్ రెడ్డి అనారోగ్యంతో నేడు మృతి చెందారు. ఆయన గొప్ప మేధావి.రాజ్యాంగ వ్యవహారాలో దిట. ఆంధ్రప్రదేశ్ రాజకయాలను క్షుణ్నంగా పరిశీలించిన నాయకుడు. వివాద రహితుడు. అనేక పుస్తకాలు రాశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు.తిరుపతిలోని సిమ్స్ లోచికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయన 1933 చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తూకివాకంలో జన్మించారు. గ్రామ సర్పంచుగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తిరుపతి నుంచి అసెంబ్లీ కి పోటీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 7 1982 నుంచి 16 January 1983 జనవరి 16 దాకా నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు.రాజకీయనాయకుడిగా చాలా మంచిపేరుతెచ్చుకున్నా ముఠా రాజకీయాల దూరంగా వుంటూవచ్చారు. తిరుపతిలో స్థిరపడ్డారు.
వారికి రాయలసీమ మేధావుల ఫోరం ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతుంది. ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి సంతాపం
రాయలసీమ ఉద్యమానికి అండగా నిలిచిన ఆగరాల
ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు తదనంతరం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం 2014 లో విభజన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తీరును నేరుగా చూచిన ఆగరాల రాయలసీమకు ప్రతి సమయంలో అన్యాయం జరిగిందని మాతో ఎపుడు చెపుతూ బాధపడే వారు. 2014 విభజన తర్వాత రాజధాని అంశం చర్చకు వచ్చినపుడు రాయలసీమ ప్రాంతంలో తగిన చర్చ జరగక పోవడం పట్ల కలత చెంది మాలాంటి వారిని పిలుచుకునే కర్నూలు రాజధాని ఏర్పాటు కోసం నాడు జరిగిన రాజకీయ పరిస్థితులను మాకు చెప్పేవారు. రాజధాని సీమ ప్రజల హక్కు అని దాని కోసం నేటి తరం పట్టించుకోకపోవడం సరికాదని నిత్యం సమావేశాలు పెట్టి చరిత్రను నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేశారు.
2014 విభజన తర్వాత జరిగిన పరిణామాలలో రాయలసీమ సమస్యలపై తిరుపతి వేదికగా జరిగిన సమావేశాలలో అధికం ఆగరాల సమక్షంలో జరిగినవే. తన స్వంత కళాశాలలో సమావేశాలు నిర్వహిస్తానని వారే బాధ్యత తీసుకుని జరిపేవారు. పప్పురి జయంతి , నీటి సమస్య పై చర్చ , రాయలసీమ అభివృద్ధి లాంటి అంశాలపై నేను నిర్వహించిన సమావేశాలు వారి సహకారంతో జరిగినవే. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఈ మధ్యనే మూడు రాజధానుల ప్రతిపాదన చర్చకు వచ్చినపుడుకుడా వారి కళాశాలలోనే చివరి సమావేశం నిర్వహించారు. రాయలసీమ ఉద్యమానికి నిత్యం అండగా నిలిచిన ఆగలరాల ధన్యజీవి. వ్యక్తిగతంగా నాపట్ల ప్రేమతో అభిమానాన్ని చూపిన ఆగరాల మరణం నాకు తీవ్ర లోటు వారి మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.