అయ్యో ఎలా? అభ్యర్థుల కెేసులన్నీబయటపెట్టండంటున్నసుప్రీం కోర్టు

ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి మీద ఎన్నికేసులున్నాయో ప్రజలకు తెలిసే అవకాశమేలేదు. రౌడీషీటర్ల దగ్గిర నుంచి అక్రమ మైనింగ్ లు చేసే దాకా పెద్ద వాళ్లంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో చాాలా మంది కేసులుంటాయి. కొందరి మీద ఖూనీ కేసులు కూడా ఉంటాయి.అత్యాచారాల కేసులుంటాయి. ఇపుడు ఇవి ప్రజలకు తెలిసే అవకాశమే లేదు. అందుకే ఇలాంటి వాళ్లంతా ఎమ్మెల్యలయిపోయి దర్జాగా విఐపిలయిపోతుంటారు. మహా అంటే వాళ్ల వూర్లో వాళ్లకి తప్ప వీళ్ల కేసులు మరొకరికి తెలియదు. ఈ చాప్టర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి, పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీచేయిస్తున్న ప్రతి అభ్యర్థి కేసుల  నేపథ్యం దేశానికంతటికి తెలియచెప్పేలా సుప్రీంకోర్టు  ఈ రోజు ఒక చారిత్రాత్మక ఉత్తర్వు జారీ చేసింది.
దేశంలో ఉన్న రాజకీయపార్టీల నేతలకు ఇబ్బందికరమయిన ఈ ఆదేశాలను గురువారం నాడు సుప్రీంకోర్టు జారీ తక్షణమ అమలుచేయాలని చెప్పింది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/police-dogs-passing-out-parade-in-hyderabad-tomorrow/

రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేయిస్తున్న అభ్యర్థుల మీద ఉన్న క్రిమినల్ కేసులన్నింటిని పార్టీల సొంత వెబ్ సైట్ లలో పోస్టు చేసి , వాళ్ళ బాగోతం నలుగురికి తెలిసేలా బాగా ప్రచారం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
అంతేకాదు, వీళ్ల మీద కేసులున్నప్పటికి ఎన్నికల్లో పోటీ చేసేందుందుకు అభ్యర్థులుగా ఎందుకు ఎంపికేచేయాల్సి వచ్చిందో కూడా వివరించాలని కోర్టు ఆదేశిచింది.
న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారిమన్ అధ్వర్యంలో బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘ నేరాల్లో చిక్కుకున్న వారిని ఎన్నికల్లో ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందో సమర్థించుకుంటూ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కారణాలు సమ్మతంగా ఉండాలి. కేవలం గెలిచే గుర్రం అనే వివరణ చాలదు అని బెంచ్ పేర్కొంది.
అభ్యర్థులన క్రిమినల్ కేసు నేపథ్యాన్ని పార్టీలు వెల్లడించాలని 2018 సెప్టెంబర్ లో ఇదే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎవరూ ఖాతరు చేయలేదని దాఖలయిన కోర్టు ధిక్కారణ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యర్థుల నేర చరిత్రను వెబ్ సైట్ లలో పెట్టడమో కాదు, దానిని విస్త్రతంగా ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్టు చేయడమే కాదు, ఒక ప్రాంతీయ భాష పత్రికతో పాటు జాతీయ ప్రతికలో కూడా ఈ వివరాలను ప్రచురించాలని కూడా కోర్టు ఆదేశిచింది.