సోమిని వూరంతా కళ్యాణ వేదిక గా మారింది. ఎటు చూసినా పెళ్లి కళ. కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో 126 సామూహిక వివాహాలు జరగడం తో గ్రామమంతా పెళ్లి ళ్ల సందడి తో మారుమోగింది.
సోమిని గ్రామం సిర్పూర్ కాగజ్ నగర్ జిల్లాలో బెజ్జూర్ మండలంలో ప్రాణహిత నది ఒడ్డున ఉంటుంది.ఈ వూర్లో ఎమ్మెల్యే సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు.
ఆ రోజుల్లో రాజు ఇంట్లో పెళ్లి సందడి ఏవిధంగా ఉండేదో ఆదే విధంగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసం తొమ్మిది రోజుల పాటు పెళ్లి పనులు తో సందడిగా మారింది.
బుధవారం ప్రాణహిత నది తీరం వేదికగా 126 జంటలకు వివాహాలు జరిగాయి. నూతన వధూవరులకు మట్టెలు మంగళసూత్రాలు అందివ్వడమే కాకుండా సారే సామాగ్రిని బాజా భజంత్రీలు వేదపండితుల మంత్రాలతో వైభవంగా అందించారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి కొడుకు కోడలు కోనేరు వంశీ సతీమణి మధులిక కుమార్తె తన్వి కొత్త దంపతులను ఆశీర్వదించారు. వారందరూ పాల్గొన్ని ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఇదంతా ఎమ్మెల్యే ఇంటి కార్యక్రమంలాగా ఘనంగా కొనసాగింది.
ఈ శుభకార్యానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా రెండు పక్క రాష్ట్రాల అతిధులు హాజరయ్యారు.