నందిగామ: అమరావతి పై ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ లో చర్చించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ గారు జై కొట్టిన తరువాతే
అమరావతి ని రాజధానిగా నిర్ణయించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
‘అమరావతి ని రాజధానిగా ప్రకటించిన రోజే చంద్రబాబు గారు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాయలసీమని ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా పథకం వేశారు. విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్న జగన్ గెలిచిన తరువాత మూడు ముక్కల రాజధాని అన్నారు,’ అని లోకేష్ నందిగామాలో మాట్లాడుతూ అన్నారు. సేవ్ అమరావతి ఉద్యమం 57 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రపంచంలో ఒక్క దేశంలో మినహా ఎక్కడ మూడు ముక్కల రాజధాని లేదు. పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో కూడా ఒకే రాజధాని. 57 రోజులుగా రైతులు,మహిళలు,యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంత ఒక రాష్ట్రం ,ఒకే రాజధాని అని నినదిస్తున్నారు . రైతుల్ని పెయిడ్ ఆర్టిసులు అన్నారు.రైతులు బురదలో ఉండాలి అన్నారు.మహిళల్ని పోలీసు బూటు కాలుతో తన్ని అవమానించారు. అమరావతి కోసం రైతులు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం ఇది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/english/features/tdp-mla-anagani-satya-prasadi-write-open-letter-to-cm-jagan-on-police-offician-kept-in-vr-without-salaries/