డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆమ్ అద్మీ పార్టీ రెండు ఘనవిజయం సాధిస్తున్నది. ఈ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, హోంత్రి అమిత్ షా తో పాటు, వందలాది ఎంపిల బలగం ఉన్న పార్లమెంటు పక్కనే ఉన్నా, ఆవేశపూరితమయి ప్రసంగాలు చేసినా ఢిల్లీ ప్రజలు బిజెపిని విశ్వసించలేదు. కేజ్రీవాల్ కే మళ్లీ పట్టం కట్టబోతున్నారు. ఒక చిన్న పార్టీ, ఒక కొత్త పార్టీ, హేమాహేమీలు, తలనెరిసిన ఎన్నికల యోధులు లేని పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రధాని మోదీనిక పక్కలో బల్లెమయి కూర్చుంటున్నది.
అఖండ విజయ ట్రెండ్ కనిపించగానే ఆప్ కార్యాలయం దగ్గిర పండగ కేరింతలు మొదలయ్యాయి. ఓట్ల కౌంటిగ్ ను కేజ్రీవాల్ పార్టీ కార్యాలయం నుంచే గమనిస్తూన్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లుంటే ఈ వార్త రాస్తున్పపుడు ఆప్ 58 స్థానాలలో అధిక్యతతో ఉంది. భారతీయ జనతా పార్టీ అధిక్యత 12కు పడిపోయింది. ఇతర పార్టీలు పత్తా లేవు. కొత్త ఢిల్లీ సీటులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధిక్యతలో ఉన్నారు. న్యూఢిల్లీ నియెజకవర్గం ఎపుడూ ఏదో ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఈ సారి ఇదే చరిత్ర పునరావృతమవుతూఉంది.
రాజిందర్ నగర్ లో ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ ఛాధా అధిక్యతలో ఉన్నారు. అయితే, ఆప్ సీనియర్ నాయకులు కొన్ని నియోజకవర్గాలలో వెనకబడి ఉండినా తర్వాతపుంజుకున్నారు.. కల్కాజీ అతిషి 209 వోట్ల వెనకవడి ఉన్నారు. షహీన్ బాగ్ పక్కనే ఉన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ బిజెపి చాలా ఉదృతంగా ప్రచారం చేసింది.
ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 11గంటల సమయంలో బిజెపి 14 స్థానాల్లో ఆధిక్యతలో ఉండింది. ఇక్కడ అధిక్యత వేయిలోపే. ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా పటపట గంజ్ లో వెనకబడి ఉన్నా, మధ్యాహ్నానికి పుంజుకుని గెలిచారు.
అక్కడ బిజెపి అభ్యర్థి రవి నెగి 1427 ఓట్ల అధిక్యత చూపి ఒక దశలో ఆప్ లో కంగారు పుట్టించిన మాట నిజమే.
మోడెల్ టౌన్ నుంచి బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా ఆప్ అభ్యర్థి అఖిలేస్ పతి త్రిపాఠీ చేతిలో ఓడిపోయాడు.కపిల్ మిశ్రా గత ఎన్నికల్లోఆప్ అభ్యర్థిగా గెలిచారు. అయితే, కేజ్రీవాల్ తో విబేధించి బిజెపిలోకి ఫిరాయించారు. అయితే,అతనిని ప్రజలు తిరస్కరించారు
లెక్కింపు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తున్నాయి. న్యూదిల్లీ, ఉత్తర దిల్లీలో ఆప్ తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్నది. షార్దా, దక్షిణ దిల్లీ, ఆగ్నేయ దిల్లీ, నైరుతి దిల్లీలో ఆప్ ఏకపక్షమే అంటుననారు. రోహిణి నియోజకవర్గంలో బిజెపి నేత విజయేంద్ర కుమార్ ముందంజలో ఉన్నారు.