మహిళ మీద జరిగే అత్యాచారాలకు సంబంధించిన కేసులలో నిందితులను ఆలస్యం లేకుండా శిక్షించేందుకు దోహదపడే దిశ పోలీస్ స్టేషన్ ను ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో ప్రారంభించారు. ఇలాంటి పోలీస్ స్టేషన్ దేశంలో ఇదే మొదటిది. అనంతరం ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం అడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో దిశ యాప్ ను కూడ ఆయన ఆవిష్కరించారు.
దిశ సంఘటన తర్వాత వెంటనే స్పందించి చట్టం తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశేనని ఆయన చెప్పారు. అత్యాచారాల కేసులలో నిందితులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఏడురోజులలో దర్యాప్తు పూర్తవుతుంది 14 రోజులలో శిక్ పడుతుుందని ఆయన చెప్పారు. దీనికోసం ప్రతిజిల్లాలో దిశకోర్టులను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహిళలు ప్లేస్టోర్ నుంచి దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఎదైన ముప్పు వాటిల్లే సూచన కనిపించగానే ఎస్ ఒ ఎస్ నొక్కగానే అందరికీ సమాచారం వెళ్లుతుందని పది సెకన్లలో మొబైల్ టీమ్స్ కు మీ దగ్గరుకు చేరుకుంటాయని ముఖ్యమంత్రి వివరించారు.