టివిలలలో,పత్రికలలో వచ్చే అడ్వర్టయిజ్ మెంట్లన్నీ మాయమాటలు చెప్పి సొమ్ము చేసుకుంటుంటాయి. పెద్ద పెద్ద కంపెనీల దగ్గిర నుంచి బాబాల దాకా ప్రతిప్రకటన ఒక పచ్చి అబద్దం. బోగస్ క్లెయిమ్స్ తో మందులు మాకులు అమ్ముకుని సొమ్ముకుని చేసుకునేందు రకరకాల ప్రటనలను ప్రజల మీదకు విసురుతుంటారు. తెలిసి కూడా చాలా మంది ఈ ప్రకటనలు చూసి బోల్తా పడుతుంటారు.జనం లోని అపోహల వల్ల, అజ్ఞానం వల్ల ఈ బాబాలు, కంపెనీలు కోట్లకు కోట్లు సొమ్ముచేసుకుంటుంటాయి.
పొద్దున లేస్తూనే మీ నల్లటి చర్మం మా ఫెయిర్ అండ్ లవ్ లీ వాడితే తెల్లబడుతుందని ఒక కంపెనీ ఒక సినీనటిని చూపి మనల్నిమోసగించే ప్రయత్నం చేస్తుంది.
మొఖానికి పూతపూసుకుంటూనే ఒక నల్లటి పిల్ల విఠలా చార్య సినిమాలోని మాయలాగా తెల్లబడిపోతుంది. వెంటనే ఆ పిల్లకు పెళ్లవుతుంది. లేకుంటే పెళ్లయ్యేది కాదమో. ఈ ముదనష్టపు కథని మనం నమ్మాలని ఈ కంపెనీ అడ్వర్జయిజ్ మెంట్లతో భయపెడుతుంది.
టూత్ పేస్టు లోళ్లు మీ పేస్టు లో ఉప్పుందా,పప్పుందా, చింతపండు వుందా అని అడిగి తమ పేస్టు వాడితే మీ పళ్లు ముత్యాల్లా మెరుస్తాయని మన ప్రాణం తీస్తుంటారు.
ఒక స్వామీజీ బారెడు తెల్లటి గడ్డం తగిలించుకుని నానా మూళికలు నూరి కాచివడపోచి వచ్చిన పనికి మాలిన పౌడర్ రోజు కు మూడుసార్లు వాడితే మోకాళ్లు నొప్పులు మటు మాయమని, ఇది వేదకాలం వైద్యమని బుకాయిస్తాడు.
ఇంకొ కంపెనీ మా తైలం వాడితే మెధో శక్తి పెరుగుతుందని ఢంకా భజాయిస్తుంది. పరీక్షల్లో పిల్లలు వెనకబడతున్నారని దిగులు బడుతున్నఅమయాకపు తల్లులను మోసగించే ప్రయత్నం చేస్తుంది.
ఏవో మాత్రలు చూపి, వాటిలో మాంత్రిక పసరుందని, వాటిని మింగితే,, మీలో మగమహారాజు పాములా బుసకొడతాడని మరొక యాడ్ గురి చూసి రాత్రి 10 గంటలపుడు అందరి ఇళ్లోలోకి దూరుతుంది.
హార్లిక్సోడు పిల్లలకు, పెద్దలకు, ముసలి ముతకా, అడ మగ అంటూ కొత్త బాటిల్స్ ను ప్రవేశపెడతాడు
మా 36 వనమూలికలతో తయారుచేసే మా నూనే వాడి వాడక ముందు మీ బట్టతల మీద వరి మడిలా జుట్టు మొలుస్తుందనో, తెల్ల వెంట్రుకలు నల్లబారుతాయని, నమ్మమని, కొని ఒక సారి పరీక్షించుక్మని చెబుతుంది మరొక కంపెనీ.
ఇలా వచ్చే బోగస్ అడ్వర్టయిజ్ మెంట్లకు కేంద్రం కళ్లెం వేసేందుకు పూనుకుంది. ఈ ఇలాంటి ఫేక్ క్లయిమ్స్ చూసి వ్యాపారాలు చేసుకునే కంపెనీల మీద, బోగస్ బాబాల మీద చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నది.
కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జక్షనబుల్ అడ్వర్టయిజ్ మెంట్స్ యాక్ట్ 1954 లో సవరణ తీసుకువచ్చి, ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్ తయారువుతున్నది. ఇలాంటి ప్రకటనలకు కారణమవుతున్న అనేక జబ్బులను, అవలక్షణాలను, ఆరోగ్యపరిస్థితులను ఈచట్టం పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రకటన దారుకు అయిదు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. దానితోపాటు రు. 50లక్షల దాకా జరిమానా కూడా విధిస్తారు.
అడ్వర్టయిజ్ మెంట్లలో వాడుకుంటున్న 78 రకాల మానసిక ఆరోగ్య పరిస్థితులును ఈచట్టం పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఇలాంటి దరిద్రపు గొట్టు క్లెయిమ్స్ తో ఏరూపంలో కూడా యాడ్ చేయకూడదు. లైట్, సౌండ్, పోస్టర్, బ్యానర్, ఇన్వాయిస్, కవర్…ఏ రూపంలో ఉన్న ఎవరైనా కేసుపెట్టవచ్చు.