అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది. ఈ ఉదయమం సమావేశమయిన క్యాబినెట్ ఈ మేరకు తీర్మానం చేసింది.
శాసన మండలి రద్దు తీర్మానం శాసనసభలో ప్రవేశపెడతారు. రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ కేంద్రానికి ఈతీర్మానాన్ని పంపిస్తారు. ఇది రద్దయితే ఏపీలో మండలి మూతపడటం ఇది రెండోసారవుతుంది.
శాసన మండలిని మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేశారు. తర్వాత మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ జరిగింది. ఇపుడు మళ్లీ రద్దు. ఇక్కడ వివాదం ఏమిటి? మండలి శాసన సభ తీర్మానాన్ని గౌరవించాలి, ప్రభుత్వానికి మద్దతునీయాలి, అంతేగాని, వ్యతిరేకించరాదు అని వైసిపి భావిస్తున్నది. టిడిపి తనకు మండలిలో బలం ఉంది కాబట్టి, తనకు నచ్చని బిల్లులను అడ్డకుంటుంది. అందువల్ల మండలిని రద్దు చేస్తే… ఈ రాజకీయం కేంద్రం పరిశీలనకు వచ్చింది. పార్లమెంటు పరిశీలించింది. ఈపరిశీలన వెలుగులో రాష్ట్రప్రభుత్వం తీర్మానం వెంటనే ఆమోదం పొందకపోవచ్చు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి మండలిని తెలంగాణ ఏపీ లకు శాసన మండలిని కూడా విభజించారు.
అయితే, రాజ్యాంగంలోని ఆర్టికిల్ 169 కింద కౌన్సిల్ రద్దు మీద అంతిమ నిర్ణయం తీసుకునేది కేంద్రమే. కేంద్రం ఒకె చేస్తేనే ఇది రద్దవుతుంది. కేంద్రం ఆమోదించని సందర్బాలున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర్మానాలను కేంద్రం ఆమోదించని సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి సారి పంపిన తీర్మానాన్ని ప్రధాని రాజీవ్ ప్రభుత్వం ఆమోదించలేదు. అపుడు కాంగ్రెస్ మండలి బలంగా ఉండింది.అయితే, 1984లో కాంగ్రెస్ ఓడిపోయింది. అపుడు మరొక సారి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ఈ సారి ఎన్టీరామారావు అవసరం రాజీవ్ గాంధీకి వచ్చింది. ఎందుకంటే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకువస్తున్నారు. దానికి టిడిపి మద్దతు అవసరం. అపుడు ఏ కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కూడా సమర్థించకపోయినా ఎన్టీరామారావు బిల్లును సమర్థించారు. దీనికి బదులుగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం శాసన మండలి రద్దును ఒకే చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండి రద్దు చట్టం 2005 ఒకే అయింది. ఇద సమయంలో తమిళనాడు లో కూడా గొడవ జరిగింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు1985లో అక్కడి శాసన మండలిని రద్దు చేశారు. తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రి కాాగానే 2010లో ఆయన పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంటు కూడా ఆమోదించింది.అయితే, మండలిని పునరుద్ధరించేలోపు డిఎంకె ప్రభుత్వం కూలిపోయింది. అధికారంలోకి వచ్చిన ఎఐఎడిఎంకె ప్రభుత్వం డిఎంకె చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.
తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు పునరుద్ధరణ కోసం తీర్మానం పంపింది. కేంద్రంలో ఉన్న విపిసింగ్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ ప్రయత్నం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చికా 2006లో , యుపిఎ ప్రభుత్వం హాయాంలో ఒకె అయింది.
2012,2103లలో రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలు శాసన మండలి కావాలని తీర్మానాలు పంపాయి. ఈ తీర్మానాలను యుపిఎ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ హాయంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అపుడు రాజ్యసభ వీటిని సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్టర్ కమిటీ ఇలా ఇష్టాను సారం రద్దు చేయడం, పునరుద్ధరించడం సరికాదు, దీని మీద ఒక జాతీయ విధానం ఉండాలని, మండలి ఉనికి శాశ్వతంగా ఉండాలని దీనికోసం జాతీయ విధానం రూపొందించాలని సూచించింది. ఆతర్వాత రాజస్థాన్,అస్సాం ప్రతిపాదనలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ లోపు కేంద్రంలో బిజెపి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చారు.
2018లో ఒదిషా ప్రభుత్వం కూడా తమకు శాసన మండలి కావాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపింది. దీనికి ఒదిషా బిజెపి, కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పాయి.
ఇది కూడా కేంద్రం దగ్గిర పెండింగులో ఉంది. కేంద్రం ఒక జాతీయ విధానం రూపొందిచేందుకే ఈ బిల్లును పెండింగులో పెట్టిందా?
ఇలాంటపుడు ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనమండలిని రద్దు చేయాలన్న తీర్మానం వెళితే, తక్షణం ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్న. కేంద్రం ధోరణి, ఇపుడు రాష్ట్ర బిజెపి విధానం చూస్తు జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించే అవకాశాలుతక్కువగా ఉన్నాయి. వైసిపి పౌరసత్వం చట్టం విషయంలో తన నిర్ణయం మార్చుకుని మద్దతు ప్రకటిస్తే బిజెపిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. అది సాధ్యమేనా?
అసలు కౌన్సిల్ కు ఈ కష్టాలు రావడానికి కారణం దాని పుట్టుకలోనే ఉన్నాయి. కౌన్సిల్ కు పార్లమెంటు ఎగువ సభతో సమానమయిన హోదాలేదు.కౌన్సిల్ కు చట్టాలు చేసే ప్రక్రియలో ఉన్న భాగ స్వామ్యం చాలా పరిమితం. శాసన సభ అనుకుంటే కౌన్సిల్ నిర్ణయాలను విస్మరించవచ్చు.దీనికితోడు శాసన మండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే హక్కు లేదు. అందుకే ఇది చాలా బలహీనమయిన సభ.
ఈ రోజు కౌన్సిల్ రద్దు మీద శాసన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం…